రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక అప్డేడ్ చేసింది. హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా రేపు (ఆదివారం) వివిధ కారణాలతో 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లింగంపల్లి – హైదరాబాద్, హైదరాబాద్ – లింగంపల్లి, ఫలక్ నుమా – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్ నుమా, సికింద్రాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – సికింద్రాబాద్ రూట్లలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణీకులు ఈ మార్పును గమనించాలని కోరింది. ఎంఎంటీఎస్ లో ప్రయాణించుకోవాలనుకునే వారు ప్రత్యామ్నాయం ఎంచుకోవాలని సూచించింది.
లింగంపల్లి – హైదరాబాద్ రూట్ లో 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140 హైదరాబాద్ – లింగంపల్లి రూట్ లో 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120, ఫలక్ నుమా – లింగంపల్లి మార్గంలో 47153, 47164, 47165, 47166, 47203, 47220, 471702, లింగంపల్లి – ఫలక్ నుమా మార్గంలో 47176, 47189, 47187, 47210, 47190, 47191, 47192, సికింద్రాబాద్ – లింగంపల్లి రూట్ లో 47150, లింగంపల్లి – సికింద్రాబాద్ రూట్ లో 47195 సర్వీసును రద్దు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..