దీపావళి పండుగ సందర్భంగా రైలు ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో, రైళ్లలో, రైల్వే ప్రాంగణాలో టపాసు / మండే స్వభావం గల వస్తువును వెంట తీసుకుని వెళ్లకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక నియంత్రణా చర్యలను చేపడుతోంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ఇటువంటి పదార్థాలను తీసుకుని వెళ్లడం భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించడమే కాకుండా చుట్టుప్రక్క ఉన్న ప్రయాణికు ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఉంటాయి.
రైలు ప్రయాణీకులు భద్రతకు, రైల్వే ఆస్తులకు నష్టం వాటించే మండే స్వభావం గల వస్తువు / పేలుడు పదార్దాలను /టపాసును తీసుకుని వెళ్లకూడదని తెలిపింది. ప్రమాదకరమైన వస్తువులు, నిషేధిత వస్తువును తీసుకుని వెళ్లడం రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164, 165 ప్రకారం రూ.1000 వరకు జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండూ విధిస్తారని అధికారులు తెలిపారు.
ప్రజల భద్రత కోసం, రైళ్లలో లేదా స్టేషన్లలో ఇలాంటి ప్రమాదకర వస్తువులను ప్రయాణికులు ఎవరైనా గమనిస్తే.. వెంటనే అధికారులకు సూచించాలని తెలిపారు. లేదా సెక్యూరిటీ హెల్ప్‌లైన్ నెం. 139 కి కాల్ చేసి సమాచారాన్ని అందించాలని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
రైళ్లలో ఇటువంటి ప్రమాదకరమైన వస్తువును తీసుకుని వెళ్లడాన్ని నియంత్రించడం కోసం అన్ని ప్రధాన స్టేషన్ల వద్ద రైల్వే భద్రతా సిబ్బంది ప్రత్యేక బృందాలను / క్విక్ రియాక్షన్ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు సాధారణ దుస్తుల్లో ఉండి స్నిఫర్ డాగ్స్ సాయంతో నిషేధిత వస్తువును తీసుకుని వెళ్లే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచుతారు.
అంతేకాకుండా ప్రత్యే నిఘా కోసం సీసీటీవీలను సైతం ఏర్పాటు చేయనున్నారు. దీంతో 24 గంట పాటు శిక్షణ పొందిన / నైపుణ్యం గల సిబ్బంది ఈ సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తుంటారు. దక్షిణ మధ్య రైల్వే రైళ్ళలో ప్రయాణీకులకు సురక్షితమైన. ఇబ్బంది లేని రైలు ప్రయాణాన్ని పొందడానికి ప్రయాణికులు సైతం సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..