Hyderabad: హైదరాబాద్‌ మార్కెట్లో హాష్‌ ఆయిల్‌.. పోలీసుల దాడులు.. 920 గ్రాముల ఆయిల్ స్వాధీనం

Hyderabad: కిరాణ షాపుల్లో పల్లినూనె దొరికినంత ఈజీగా హైదరాబాద్‌ మార్కెట్లో హాష్‌ ఆయిల్‌ లభ్యమవుతోంది. దీంతో మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పలువరిని పోలీసులు..

Hyderabad: హైదరాబాద్‌ మార్కెట్లో హాష్‌ ఆయిల్‌.. పోలీసుల దాడులు.. 920 గ్రాముల ఆయిల్ స్వాధీనం
Hash Oil Seized

Edited By:

Updated on: Mar 19, 2026 | 8:18 PM

షెరిలింగంపల్లి SOT టీమ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యప్ప సొసైటీ, సిటీ వైన్స్ సమీపంలో దాడి చేసింది. NDPS చట్టం కింద పేడ్లింగ్, వినియోగంపై చర్యలు తీసుకున్నారు. పరుసముల దినేష్ (28), కారు మెకానిక్‌ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద 184 చిన్న బాక్సుల్లో 920 గ్రాముల వీడ్ ఆయిల్ (ఒక్కో బాక్స్ 5 గ్రా.) స్వాధీనం చేసుకున్నారు.

దినేష్ ముసాపేట్ ప్రవీణ్‌కు చెందిన డ్రై గంజాయి కొని, నగదు లావాదేవీలు చేసి బైక్‌పై గాయత్రి నగర్ నుంచి మాదాపూర్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇతను గతంలో NDPS కేసుల్లో కూడా ఉన్నాడు. ఈ కేసులో ప్రవీణ్, యూసుఫ్, శరత్, విన్ని, చందు, రేవంత్‌లు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

వీడ్ ఆయిల్, హష్ ఆయిల్ ఏమిటి?

వీడ్ ఆయిల్, హష్ ఆయిల్ అనేది గంజాయి మొక్క నుంచి (కానబిస్) THC అధికంగా ఉన్న ద్రవ రసం. అయితే డ్రై గంజాయి (560 కేజీల నుంచి 13.5 కేజీ ఆయిల్) నుంచి బ్యూటేన్, CO2 వంటి పద్ధతులతో ఎక్స్‌ట్రాక్ట్ చేస్తారు. NDPS చట్టం ప్రకారం.. హాష్ ఆయిల్ ‘కానబిస్’ వర్గంలోకి వస్తుంది. హైదరాబాద్ బ్లాక్ మార్కెట్‌లో 1 కేజీ గంజా రూ.5,000-6,000, హష్ ఆయిల్ రూ.10-15 లక్షల వరకు ధర పలుకుతుంది. దీన్ని వాపరైజ్, డాబ్ చేస్తే THC వల్ల మైగ్రేన్, పారానాయా, ఆంక్షెటీ, డిజినెస్ వస్తాయి. ఊపిరితిత్తులకు ఇరిటేషన్, దీర్ఘకాలిక వాడకం వల్ల మెదడు, మానసిక ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. మాధాపూర్, గాచిబౌలి, కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విద్యార్థులకు టార్గెట్ చేసి వీటిని అమ్ముతుంటారు.

ఈ కేసులో కానబిస్ కమర్షియల్ క్వాంటిటీ (20 కేజీలు)కు 10-20 సంవత్సరాల జైలు + రూ.1-2 లక్షలు జరిమానా ఉంటుంది. 920 గ్రా. ‘మోర్ థాన్ స్మాల్ బట్ లెస్ థాన్ కమర్షియల్’ – 10 సంవత్సరాల వరకు జైలు + రూ.1 లక్ష జరిమానా ఉండవచ్చు.  మాదాపూర్‌ SOT తాజాగా అయ్యప్ప సొసైటీలో MDMA (14 గ్రా., రూ.30,000) స్వాధీనం చేసుకుంది. మియాపూర్‌లో 1.5 కేజీ హష్ ఆయిల్ (రూ.3 లక్షలు). గచ్చిబౌలి, నానక్రమ్‌గూర్‌లో గంజా (830 గ్రా.) గంజాయి పెడలింగ్ లింకులను పట్టుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us