Hyderabad: క్రికెట్‌ ఆడుతుండగా తలనొప్పి.. వెళ్లి పక్కన కూర్చున్నాడు.. అంతలోనే

|

Mar 04, 2024 | 3:07 PM

హార్ట్ ఎటాక్.. ఇప్పుడు మనిషిని తీవ్రంగా వెంటాడుతోన్న భయం ఇది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. కానీ గత కొంత కాలంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. అటాక్ చేస్తోంది. అప్పటిదాకా.. ఆడుతూ.. పాడుతూ.. నవ్వుతూ.. నడుస్తూ.. ఉంటారు.. సడెన్‌గా కుప్పకూలిపోయి ప్రాణాలు విడుస్తున్నారు.

Hyderabad: క్రికెట్‌ ఆడుతుండగా తలనొప్పి.. వెళ్లి పక్కన కూర్చున్నాడు.. అంతలోనే
Cricket Ground (Representative image)
Follow us on

గుండెపోటు.. ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతున్న పదం. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న భయం. చిన్న, పెద్ద డిఫరెన్స్ లేదు.. ధనిక, పేద అనే బేధం లేదు.. ఏజ్ అస్సలు మేటర్ కాదు. అందరినీ కాటేస్తోంది హార్ట్ ఎటాక్. కుర్రాళ్లు, యువకులు, ఆరోగ్యవంతులు.. ఎవరినీ వదలడం లేదు. ఉన్నట్టుండి సడెన్ గా హార్ట్ ఎటాక్ వస్తుంది. అంతే, కుప్పకూలిపోతాడు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోతాడు. అప్పటివరకు బాగున్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు. ఎప్పుడు, ఎవరికి ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. నిలబడ్డవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. ఏమైందో ఆరాతీసే లోపే తుదిశ్వాస విడుస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గుండెపోట్లతో గుండె బేజారవుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా పట్టుమని పాతికేళ్ళు కూడా లేని వాళ్ళు ఉన్నఫళంగా గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా.. భాగ్యనగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి క్రికెట్ ఆడుతూనే గ్రౌండ్‌లోనే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన కాశిరెడ్డి సంజయ్‌ భార్గవ్‌ (24) TCSలో సాఫ్ట్‌వేర్‌ జాబ్ చేస్తున్నాడు.  గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి వద్ద ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ రోజు ఆఫీసుకు వెళ్తున్నాడు. అయితే వారంతాల్లో ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లి క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఈ  శనివారం ఉదయం కూడా తన ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడేందుకు..  ఘట్టుపల్లిలోని కేసీఆర్‌ క్రికెట్‌ స్టేడియంకి వెళ్లాడు. మ్యాచ్ ఆడుతుండగా.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో.. తలనొప్పిగా ఉందంటూ పక్కకు వెళ్లి కూర్చున్నాడు. అలా కూర్చున్న కొద్ది సేపటికే ఫిట్స్‌ రావడంతో.. స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..