హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ హైదర్ గూడలో విషాదం చోటు చేసుకుంది. పార్క్ నిర్వహణా లోపానికి ఆరేళ్ల పసిప్రాణం బలి అయ్యింది. సిమెంట్ బెంచ్ మీద పడి, తలకు బలమైన గాయం కావడంతో దిలీప్ శర్మ(6) అనే బాలుడు దుర్మరణం చెందాడు. విరిగిన సిమెంట్ బెంచి ఉంచడం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని పార్క్‌లో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.