హైదరాబాద్, జులై 29: నల్గొండ జిల్లా నిడమనూరు కి చెందిన కాంగ్రెస్ నేత రంగ సాయి రెడ్డి కుమారుడు వల్లభ్ రెడ్డి పై హైదరాబాద్ లో మర్డర్ కేసు నమోదైంది.హిమాయత్ నగర్ లో నివసిస్తున్న వల్లబ్ రెడ్డి పై భార్యను హత్య చేశాడని నారాయన గూడా పోలీసుల మర్డర్ కేస బుక్ చేసి జైల్ కి పంపారు. 21.4.22 నాడు వల్లభ్ రెడ్డి కి లహరి రెడ్డి కి ఘనం గా పెళ్లి జరిగింది.ఐతే లహరి సామాన్య కుటుంబ కాగా వల్లభ్ రెడ్డి ది రాజకీయ పలుకుబడి ఉన్న భూస్వామి కుటుంబం. వల్లభ్ రెడ్డి ఒక్కగానక కొడుకు కావడంతో తమ కూతురు సుఖపడుతుందని ఆశ తో ఇచ్చారు. వారు అంకుంటునట్టు గానే అమ్మాయి సంతోషం గా ఉందని అంటున్నారు. ఐతే ఈ నెల 14 కూడా నారాయణగూడ పోలీసులకు లహరి రెడ్డి అనే అమ్మాయి మృతి చెందిన విషయంపై సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లగా ప్రమాదవశాత్తు చనిపోయిందని అబ్బాయితో పాటు లహరి రెడ్డి తండ్రి జైపాల్ రెడ్డి కుటుంబం కూడా పోలీసులకు అదే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ బాడీని పరిశీలించిన పోలీసులకు మాత్రం ఏదో అనుమానం వచ్చింది. డాక్టర్ సంప్రదించగా గాయాల ఆనవాళ్లు చూస్తే ప్రమాద వశాత్తు జరిగిన మరణం కాదని ఉద్దేశపూర్వంగా తీవ్రంగా దాడి చేయడంతోనే చనిపోయిందని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో.. తీవ్రంగా దాడి చేయడం వల్లనే యువతి చనిపోయిందని నిర్ధారించారు. యువతి కడుపులో బలంగా దాడి చేసిన గాయాలు ఉన్నాయని తేలింది. అంతేకాకుండా రెండున్నర లీటర్ల రక్తం ఇంటర్నల్ బ్లీడ్ అయ్యి గడ్డకట్టినట్టు రిపోర్ట్‌లో తేలింది.
ఇది ఇలా ఉంటే మరోపక్క భార్య దశదినకర్మలను నల్గొండ జిల్లా తన స్వగ్రామం నిడమానూరులో చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఊరంతా భార్య పోస్టర్లతో వేయించి పదివేల మందికి భోజన ఏర్పాట్లు చేసి చాలా గ్రాండ్‌గా కార్యక్రమాలు జరిపించారు. జిల్లాకు సంబంధించిన అన్ని పార్టీల నుంచి ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో రెడ్డికి స్థానికంగా సింపతి క్రియేట్ అయింది. 24న ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించాడు. అయితే 26వ తారీఖున నిడమనూరు వెళ్లిన నారాయణగూడ పోలీసులు చాకచక్యంగా అక్కడి నుంచి వల్లభ్ రెడ్డిని తీసుకొచ్చి అరెస్టు చేశారు. మొదట పోలీసుల ముందు సహజ మరణం అని చెప్పిన పోస్టుమార్టం రిపోర్ట్ ముందుంచి తమదైన స్టైల్‌లో విచారించడంతో తనతో గొడవ పడుతోందని షార్ట్ టెంపర్‌లో విచక్షణ కోల్పోయి లహరి పై తీవ్రంగా దాడి చేశానని ఒప్పుకున్నాడు. తల పగల కొట్టి బలంగా గుద్ది కింద పడేసి కడుపులో ఎగిరితన్నానని ఒప్పుకున్నాడు.
హత్య, సాక్షాలు చెరిపేసినట్లుగా నిర్దారించి sections 201, 302 కేసులు నమోదు చేశారు. అయితే లహరి తండ్రి జైపాల్ రెడ్డి మాత్రం తమ అల్లుడు బంగారమని పోలీసుల అనవసరంగా మా అల్లుడిపై కేసు పెట్టారని, మా అమ్మాయిని మా అల్లుడు హత్య చేయలేదని అంటున్నాడు. అసలు నేను స్టేట్మెంట్ ఇవ్వకుండానే ఎలా చార్జ్ షీట్ వేశారని ఇలా తప్పు కేసు పెట్టినందుకు సీపీకి మెమోరాండం ఇచ్చామని అంటున్నాడు. ఇక పోస్టుమార్టం రిపోర్ట్‌లో హత్యని నిర్ధారించారు కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. పోస్టుమార్టం రిపోర్ట్ పై అనుమానాలు ఉన్నాయని మాకు తెలిసిన డాక్టర్ తో దీనిపై చర్చించి మాట్లాడదామని అన్నాడు. అయితే కూతురుని హత్య చేసిన అల్లుడు కుటుంబాన్ని జైపాల్ రెడ్డి ఎందుకు వెనకేసుకు వస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..