Shankarpally: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య!

|

Jul 17, 2022 | 8:42 PM

స్థానికంగా కలకలం రేపిన శంకర్‌పల్లి హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. జులై 11న రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లిలో చోటుచేసుకున్న పండ్ల వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మృతుడి భార్య..

Shankarpally: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య!
Shankarpalli Murder Case
Follow us on

Police solved Shankarpalli murder case: స్థానికంగా కలకలం రేపిన శంకర్‌పల్లి హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. జులై 11న రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లిలో చోటుచేసుకున్న పండ్ల వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మృతుడి భార్య ప్రియుడితో కలిసి చంపించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ మేరకు నేరాన్ని అంగీకరించిన నిందితులను జులై 16న రిమాండ్‌ తరలించారు. వివరాల్లోకెళ్తే..

కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన శంకరయ్య(43), జయసుధ (38) దంపతులు. వీరు 14ఏళ్ల క్రితం పటాన్‌చెరు సమీపంలోనున్న బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకున్నారు. ఈ క్రమంలో శంకరయ్య సంవత్సరం క్రితం శంకర్‌పల్లి మండలం పరిధిలోనున్న టంగటూర్‌లో దానిమ్మ తోటను లీజుకు తీసుకుని, వారానికోసారి తోటదగ్గరికి వచ్చి వెళ్తుండేవాడు. ఐతే తమ పండ్ల దుకాణంలో ఉండే భార్య జయసుధకు సమీపంలోనున్న జిమ్‌ట్రైనర్‌ తిరుపతిరావుతో సాన్నిహిత్యం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో రెండు నెలలుగా భర్తకు అనుమానం రాకుండా వ్యవహారం నడిపిస్తున్న భార్య జయసుధ.. భర్త శంకరయ్య తాగుబోతని, రోజు తాగొచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతన్ని చంపి అడ్డు తొలగిస్తే, మనమిద్దరం సంతోషంగా ఉండొచ్చని తిరుపతిరావుకి చెప్పి, హత్యకు పథకం పన్నారు.

ఇవి కూడా చదవండి

కుట్ర ప్రకారం జులై 11న శంకరయ్య దానిమ్మ తోటకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఊరి బయట మాటు వేసిన తిరుపతిరావు అతని తలపై  కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. ఐతే హత్య ఉదంతం బయటకు పొక్కడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు వాడిన ద్విచక్రవాహనం ఆధారంగా జులై 15 (శుక్రవారం) పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నిందతుడు నిజం ఒప్పుకున్నట్లు పోలీసధికారులు మీడియాకు తెలిపారు. హత్య కేసును వేగంగా చేధించినందుకు సీఐ, ఎస్సై, ఇతర సిబ్బందిని ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ మహేష్‌గౌడ్‌ అభినందనలు తెలిపారు.