
హైదరాబాద్, ఆగస్టు 16: హైదరాబాద్ మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో 30 గంటలపాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఆగస్టు 19 ఉదయం 6 గంటల నుంచి కుళాయి నీటికి అంతరాయం ఏర్పడనుంది. ఎర్రగడ్డ, అమీర్‌పేట, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరి గుట్ట, ఎల్లారెడ్డిగూడ, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీ నగర్, మదీనా గూడ, మియాపూర్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపిస్తుంది.
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై ఫేజ్ – 2 లో కలబ్ గూర్ నుంచి పటాన్ చెరు వరకు, పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు గల 1500mm డయా ఎంఎస్ పైపులైన్ కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఆర్ అండ్ బీ శాఖ బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్ వద్ద నూతనంగా నిర్మిస్తోన్న ఫ్లై ఓవర్ పనులకు ఆటంకం లేకుండా ఈ జంక్షన్ పనులు చేపడుతున్నారు.
దీంతో ఈ నెల 19వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 20 తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పనులు జరుగుతాయి. దీంతో ఈ 30 గంటలపాటు నరంలోని ఈ కీలక ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా కొన్ని చోట్ల పాక్షికంగా మరికొన్నిట్లో అంతరాయం ఏర్పడనుంది.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ ఒక పత్రికా ప్రకటనలో కోరింది. పనులు ముగిసిన వెంటనే నీటిని అందించనుంది. ఏదైతే నీటి సరఫరా అంతరాయం ఏర్పండుతుందో ఆ కాలనీలవారు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అందుకు తగినట్లుగా నీటిని పొదుపు చేసుకోవడంతోపాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి హైదరాబాద్ సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి