Hyderabad: మియాపూర్ పోలీసుల చేతిలో వరుస ఇళ్ల దొంగ.. 45 కేసుల చరిత్ర

వరుస దొంగనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని మియాపూర్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాచ్‌మన్ రూమ్‌లను గుర్తించి వాళ్లు లేని సమయంలో ఇతడు దొంగనాలకు పాల్పడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. గతంలోనే ఇతడిపై కేసులు ఉన్నాయి.

Hyderabad: మియాపూర్ పోలీసుల చేతిలో వరుస ఇళ్ల దొంగ.. 45 కేసుల చరిత్ర
Police

Edited By:

Updated on: Apr 24, 2026 | 8:17 PM

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వాచ్‌మన్ లేనపుడు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న హౌస్ బర్గ్లరీ నేరస్థుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా వాల్లెపు వెంకటేష్ అలియాస్ వెంకట్‌ను అదుపులోకి తీసుకుని, నాలుగు కేసులు ఛేదించారు. 24వ తేదీ ఉదయం మయూరినగర్‌లో యాక్టివా స్కూటర్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న వెంకట్‌ను క్రైమ్ పెట్రోల్ సిబ్బంది పట్టుకున్నారు. అతని వద్ద 4 గ్రాముల బంగారు ఆభరణాలు, 607 గ్రాముల వెండి, యాక్టివా వాహనం స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు నివాస కాలనీల్లో వాచ్‌మన్ రూమ్ లను గుర్తించి బయటకు వెళ్లినప్పుడు బంగారం, వెండి, నగదు దొంగిలించేవాడు. మియాపూర్‌లో మూడు, గచ్చిబౌలిలో ఒక కేసు తేలాయి. గతంలో మాధాపూర్, కేపీహెచ్‌బీ, కుకట్‌పల్లి, బాచుపల్లి, దుండిగల్, చందానగర్, ఆర్‌సీపురం, బాలానగర్, జగద్గిరిగుట్ట, ఎల్‌బీనగర్‌తో కలిపి 45 దొంగతనాల్లో జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు వెల్లడిచారు. ఈ సక్సెస్‌కు మియాపూర్ పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. వెంకటేష్ దొరకటంతో గచ్చిబౌలి మియాపూర్ ప్రాంతంలో మధ్యరాత్రి ఇళ్లల్లో చెప్పే తుంగతనాలు తగ్గుతాయని పోలీసులు భావిస్తున్నారు.

Follow Us