అప్పుడు ఎయిర్‌హోస్టెస్.. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్
16 June 2026
Pic credit - Instagram
Rajeev
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు.
1995 డిసెంబర్ 11 కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లా శృంగేరిలో జన్మించింది ఈ వయ్యారి భామ. ఆమె మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది.
కన్నడ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ శివ రాజ్‌కుమార్ వజ్రకాయ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాదు ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013 లో టాప్ 10 లో నభా కనిపించింది.
ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ చిన్నది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.
కెరీర్ పీక్ లో ఉండగానే యాక్సిడెంట్ అయ్యింది. దాంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది ఈ అందాలతార.
ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ తిరిగి బిజీ అవుతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఫొటోలతో కవ్విస్తుంది.