Telangana: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. వరుసగా 2 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..

తెలంగాణలోని విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. వచ్చే నెల 29, 30 తేదీల్లో గ్రూప్-2 రాత పరీక్షను నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆ పరీక్షకు కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. వరుసగా 2 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
వరదలు, వర్షాలు.. వైరల్ ఫీవర్లు.. ఇలా కారణాలు ఏదైనా కూడా ఈ ఏడాది స్కూళ్లకు, కాలేజీలకు భారీగానే సెలవులు వచ్చేశాయ్. మొన్నటికి మొన్న జూలైలో అకాల వర్షాలు కురువడం వల్ల అనుకోని విధంగా 10 రోజుల పాటు కాలేజీలకు, స్కూళ్లకు సెలవులు వచ్చాయి.

Updated on: Jul 28, 2023 | 4:46 PM

తెలంగాణలోని విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. వచ్చే నెల 29, 30 తేదీల్లో గ్రూప్-2 రాత పరీక్షను నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆ పరీక్షకు కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పరీక్షా కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్షను రెండు షిఫ్టులుగా నిర్వహించనుంది టీఎస్‌పీఎస్‌సీ. అటు టీఎస్‌పీఎస్సీ మొత్తం 783 పోస్టుల భర్తీ చేసేందుకు గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేయగా, దీనికి 5.51 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.