SCR:ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్..ఆ రైళ్ల కోసం ఇకపై సికింద్రాబాద్ వెళ్లకండి

|

Apr 04, 2025 | 5:33 PM

SC Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరమ్మత్తుల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే సుమారు 10 రైళ్ల గమ్య స్థానాలను ఇతర స్టేషన్‌లకు మారుస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ స్టేషన్ మరమ్మత్తు పూర్తైయ్యే వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది.

SCR:ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్..ఆ రైళ్ల కోసం ఇకపై సికింద్రాబాద్ వెళ్లకండి
Train Route Change
Follow us on

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పనర్మిర్మాణ పనుల నేపథ్యంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రాకపోకలు సాగించే సుమారు 10 రైళ్ల గమ్యస్థానాలను ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నట్టు రైల్వేశాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ స్టేషన్ కు వచ్చే రైళ్లను..చర్లపల్లి, కాచిగూడ, హైదరాబాద్‌, మల్కాజిగిరి, రైల్వేస్టేషన్లకు మళ్లిస్తున్నట్టు తెలిపింది. అయితే ఇక్కడ కేవలం రైళ్లు వెళ్లే చివరి గమ్య స్థానాలను మాత్రమే రైల్వే శాఖ మార్చినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ మరమ్మత్తులు పూర్తైన తర్వాత యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని రైల్వే శాఖ వెల్లడించింది.

రైళ్ల రాకపోకల మార్పును ఒకసారి గమనిస్తే…

సిద్ధిపేట-సికింద్రాబాద్ మధ్య నడిచే డెమో రైళ్లను మల్కాజ్‌గిరి స్టేషన్ మార్చారు.

పుణే-సికింద్రాబాబ్ మధ్య నడిచే పుణే ఎక్స్‌ప్రెస్‌ (12025/12026) ట్రైన్ గమ్యస్థానాన్ని హైదరాబాద్‌కు మార్చారు.

సికింద్రాబాద్ -మణుగూరు మధ్య నడిచే సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ (12745/12746) చర్లపల్లి స్టేషన్ నుంచి ప్రారంభమై మణుగూరుకు వెళ్తోంది.

సికింద్రాబాద్-రేపల్లే మధ్య నడిచే సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17645/17646) ట్రైన్‌ కూడా చర్లపల్లి స్టేషన్ నుంచి బయల్దేరుతుంది.

సిల్చార్-సికింద్రాబాద్ మధ్య నడిచే సిల్చార్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- దర్భంగా మధ్య నడిచే సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు కూడా చర్లపల్లి స్టేషన్ నుంచే బయల్దేరుతాయి.

సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ (12735/12736) చర్లపల్లి స్టేషన్‌ నుంచి బయల్దేరి..సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా యశ్వంత్‌పూర్‌కు వెళ్తోంది.

విజయవాడ-సికింద్రబాబ్‌ మద్య నడిచే శాతవాహనా ఎక్స్‌ప్రెస్ (12713/12714) ట్రైన్‌ విజయవాడలో బయల్దేరి కాచిగూడ స్టేషన్‌కు వెళ్తోంది.