Sankranti Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 200లకు పైగా స్పెషల్ ట్రైన్స్..

|

Jan 12, 2022 | 8:20 AM

Sankranti Special Trains: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇళ్లకు వెళ్లేవారితో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ మేరకు ఇరు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీతో

Sankranti Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 200లకు పైగా స్పెషల్ ట్రైన్స్..
Sankranti Special Trains
Follow us on

Sankranti Special Trains: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇళ్లకు వెళ్లేవారితో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ మేరకు ఇరు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీతో పాటు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్‌ను నడిపిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. పండుగ రద్దీ నేపథ్యంలో జనవరి 1 నుంచి జనవరి 20 వరకు 208 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రయాణీకుల రద్దీ, సంక్రాంతి పండుగ దృష్ట్యా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మొత్తం 208 ప్రత్యేక రైళ్లను – హైదరాబాద్ ప్రాంతం నుంచి ఏర్పాటు (SCR) చేసినట్లు తెలిపింది.

పండుగ సీజన్‌లో కాన్‌కోర్స్ లేదా వేచి ఉండే ప్రదేశాలను, రద్దీగా ఉండే ప్లాట్‌ఫారమ్‌లను నివారించాలని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ అధికారులు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. రైలు ప్రయాణికులందరికీ సేవలందించేందుకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. జనసాధరన్ (రెండవ సీటింగ్ వసతి), AC స్పెషల్, సువిధ (ప్రత్యేక ఛార్జీలు) సర్వీసులు హైదరాబాద్ నుంచి అన్ని ప్రాంతాలకు నడిచే విధంగా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాకేష్ తెలిపారు.

208 రైళ్లలో వాటిలో 50% లేదా 100 కంటే ఎక్కువ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. SCR జోన్‌లోని కొన్ని ప్రధాన గమ్యస్థానాలలో హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి ఉన్నట్లు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ మొదలైన ప్రధాన స్టేషన్‌లను కవర్ చేస్తూ దాదాపు 30 ప్రత్యేక రైళ్లు ఇతర జోన్‌ల నుంచి బయలుదేరి దక్షిణ మధ్య జోన్‌ను రవాణా కొనసాగిస్తున్నాయన్నారు. నిత్యం రైళ్ల వెయిటింగ్ జాబితాలను పర్యవేక్షిస్తూ.. డిమాండ్‌ను బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లను కేటాయిస్తామని రాకేష్ చెప్పారు.

Also Read:

Shamshabad: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. అనుమానం రాకుండా లో దుస్తుల్లో..

Sankranthi Sambaralu: మొదలైన సంక్రాంతి సంబరాలు.. ఇంటింటి రంగవల్లులు.. జోరందుకున్న పందేలు