Sadar Mela: హైదరాబాద్‌లో అంబరాన్నంటిన సదర్ సంబరాలు.. ఖైరతాబాద్ చౌరస్తాలో పరుగులు పెట్టిన దున్నపోతు

|

Nov 06, 2021 | 7:04 AM

భాగ్యనగరంలో సదర్‌ వేడుక అంబరాన్నంటింది. నగరానికే తలమానికమైన సదర్ సంబరాలు ఈసారి కూడా హైలైట్‌గా నిలిచాయి.

Sadar Mela: హైదరాబాద్‌లో అంబరాన్నంటిన సదర్ సంబరాలు.. ఖైరతాబాద్ చౌరస్తాలో పరుగులు పెట్టిన దున్నపోతు
Sadae Mela
Follow us on

Hyderabad Sadar Festival: భాగ్యనగరంలో సదర్‌ వేడుక అంబరాన్నంటింది. నగరానికే తలమానికమైన సదర్ సంబరాలు ఈసారి కూడా హైలైట్‌గా నిలిచాయి. దున్నపోతుల ప్రదర్శన ప్రత్యేకత సంతరించుకుంది. దీపావళి పండుగ తెల్లారి నిర్వహించే సదర్‌ సంబరాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రతియేటా నగరంలోని యాదవులు సదర్ ఉత్సవాలను ఉల్లాసంగా నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా ఖరీదైన దున్నపోతులను ప్రదర్శనకు పెట్టారు. వాటిని సుందరంగా అలంకరించి ఊరేగించారు. వీటి వెంట ఈలలు, డ్యాన్సులు, మ్యూజక్‌లతో ఎంజాయ్ చేశారు కుర్రకారు. ఖైరతాబాద్, ఎల్లారెడ్డిగూడ, లాల్ బజార్, నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో సదర్ సంబరాలు వైభవంగా సాగాయి. సదర్‌ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. యాదవులతో కలిసి డ్యాన్స్‌ చేశారు దానం నాగేందర్‌.

అంతా సందడిగానే సాగినా, ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతు పరుగులు పెట్టింది. సదర్‌కు ముస్తాబు చేస్తుండగా.. తాడు తెంచుకున్న దున్నపోతు పరుగులు తీసింది. స్కూటీనీ కొంతదూరం లాక్కెళ్లింది దున్నపోతు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమవగా.. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. సదర్ కోసం నగరంలోని యాదవ్‌లు పంజాబ్, హర్యానాల నుంచి దున్నరాజులను కొని తెస్తుంటారు. ఉత్సవాలకు ముందుగానే తెచ్చి వాటికి నాణ్యమైన దానా పెట్టి బలిష్టంగా తయారుచేస్తారు యాదవులు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డ తర్వాత, డ్రైఫ్రూట్స్, అరటి పండ్లు, పాలు వంటి పౌష్టికాహారం అందిస్తారు. వీటిని ప్రత్యేకంగా హర్యానా నుంచి లక్షల రూపాయలు వెచ్చించి తెస్తారు. ఉత్సవాలు అయిపోగానే తిరిగి వారికి అప్పగిస్తారు.

Read Also…  Bandi Sanjay: అసలు దోషి టీఆర్ఎస్ ప్రభుత్వమే.. పెట్రోల్‌పై వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదు: బండి సంజయ్