హైదరాబాద్ వాసులకు దీపావళి అంటే టపాసుల, దీపాలే కాదు.. సదర్ కూడా. ఈ సారి వేడుకలకు నగరం రెడీ అయింది. ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన దున్నలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని యాదవులు నిర్వహించే సదర్ సమ్మేళనంలో పాల్గొనే దున్నపోతులు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. హర్యానా, కేరళ నుంచి దున్నపోతులను ప్రత్యేక వాహనాల్లో రప్పించారు. ఈనెల 27న నారాయణగూడలో జరగనున్న వేడుకలు ఘనంగా జరగనున్నాయి. కాచిగూడ చెప్పల్ బజార్‌లో చిట్టబోయిన లడ్డు యాదవ్, సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బాహుబలి, కమాండో, ప్రిన్స్ బాబు, బల్ రామ్, వీర.. ఈ సారి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. వీటికి రోజు 30 లీటర్ల పాలతో పాటు డ్రై ఫ్రూట్స్ ఆహారంగా ఇస్తామని లడ్డు యాదవ్, సందీప్ యాదవ్ చెప్తున్నారు.
హర్యానాతో పాటు పంజాబ్ నుంచి దున్నరాజులను నగరానికి తెప్పించారు. పండుగ రోజు భారీ దున్నలు నగర రోడ్లపై అందంగా ముస్తాబై ర్యాలీ తీయనున్నాయి. ఈసారి ఉత్సవాల్లో 9 దున్నరాజులు సందడి చేయన్నాయి. ఇవి నడిచొస్తుంటే కొండలు కదిలొచ్చినట్టు ఉంటాయి. ఆకారంలో మదపుటేనుగులను తలపిస్తాయ్.. చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇవి మహా మహిషాలు.. బాహుబలిని మించిన ఈ బాహుబుల్స్. 1946లో నారాయణగూడలో సదర్ ప్రారంభమైంది. 2009 నుంచి మరింత ఘనంగా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి