
హైదరాబాద్.. అందరినీ ఆదరించే మహానగరం. ఎవరైనా ఒక్కసారి ఈ నగరానికి వస్తే.. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంతలా వారి మనస్సులకు హత్తుకుపోతుంది ఈ సూపర్ సిటీ. నగరంలోని ఎత్తైన భవనాలు, అందమైన ప్రదేశాలు.. ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఇలానే హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఒక క్సేనియా షకిర్జియానోవా రష్యన్ మోడల్.. నగర అందాలను చూసి ఆశ్చర్యపోయింది. రాయదుర్గం, హైటెక్ సిటీలోని ఎత్తైన బిల్డింగ్స్, అక్కడి యాంబియన్స్, విషాలమైన రోడ్లు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో నగర అందాలకు మంత్రముగ్దురాలైన ఆ యువతి వాటిని వీడియో తీసి ఒక రీల్ క్రియేట్ చేసి.. హైదరాబాద్‌ను దూబాయ్‌తో పోల్చుతూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది.
ఈ వీడియోకు ఆమెకు ఇది దుబాయ్ కాదు.. ఇది హైదరాబాద్ అనే క్యాప్షన్ యాడ్స్ చేసి ఆశ్చర్యపోతున్న ఇమోజీతో పోస్ట్ చేసింది. ఈ వీడియోతో ఆమె నగరవాసుల హృదయాలను గెలుచుకుంది. దీంతో వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ దాన్ని లైక్, షేర్ చేస్తూ తెగవైరల్ చేశారు. దీంతో ఈ వీడియో కొన్ని గంటల్లోనే లక్షల్లో వీవ్స్, లైక్స్ సంపాధించింది. ఈ వీడియోను క్సేనియా ఆగస్టు 21 న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడా.. ఇప్పటివరకు ఈ వీడియోకు 8 లక్షల 73 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.
ఈ వైరల్ వీడియోలో, ఒక రష్యన్ మహిళ హైదరాబాద్ హైటెక్ సిటీ చుట్టూ తిరుగుతూ దాని అందాలను చూసి ఆశ్చర్యపోతుండడం మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆ వీడియో ఆమె ‘హబీబీ ఇట్స్ నాట్ దుబాయ్.. ఇట్స్ హైదరాబాద్’ క్యాప్షన్ ఇవ్వడం కూడా కనిపిస్తుంది. క్సేనియా వీడియోపై ప్రజలు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. చాలా మంది హైదరాబాద్ అభివృద్ధిని ప్రశంసించగా.. కొందరు మాత్రం అది హైదరాబాద్ ఒకవైపు మాత్రమే.. మొత్తం హైదరాబాద్ కాదని రాసుకొచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.