AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఫ్యాన్సీ నెంబర్లకు అదిరే డిమాండ్.. 9999కు మైండ్ బ్లాంక్ అయ్యే ధర

ఫ్యాన్సీ నంబర్స్‌పై కొందరికి భలే మోజు ఉంటుంది. వాటిని దక్కించుకునేందుకు లక్షలు పెట్టేందుకు కూడా వెనకాడరు. అలాంటి వాళ్ల ఆశే ఇప్పుడు తెలంగాణ ఆర్టీఏకు కాసుల పంట పండిస్తుంది. తాజాగా ఖైరతాబాద్‌లోని RTA ఆఫీసులో తాజాగా నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా భారీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏ నంబర్‌కు ఎంత ఆదాయం వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

Hyderabad: ఫ్యాన్సీ నెంబర్లకు అదిరే డిమాండ్.. 9999కు మైండ్ బ్లాంక్ అయ్యే ధర
Fancy Number
Ram Naramaneni
|

Updated on: Aug 09, 2023 | 8:55 AM

Share

హైదరాబాద్, ఆగస్టు 9:  ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు..సెంటిమెంట్‌ అయితేనేమి, ఇష్టమైన నంబ‌ర్‌ అయితేనేమి, జాతక బలం ప్రకారం అయితేనేమి.. అనుకున్న నంబర్‌ను ద‌క్కించుకునేందుకు వాహ‌నాల య‌జ‌మానులు ఎంతదాకా అయినా ఖర్చు చేసిన సందర్భాలు చూశాం. ఇందులో సెలబ్రిటీలతో పాటు సంపన్న వర్గాల వారు ఉంటారు. ఈ క్రమంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో..ఒక్కరోజే ఖైర‌తాబాద్ ఆర్టీఏ ఆఫీసులో కాసుల వర్షం కురిసింది. ఫ్యాన్సీ నెంబర్ క్రేజ్‌ కారణంగా..ఒక్కరోజులో అరకోటిపైనే ఆదాయం వచ్చిపడింది.  ఫ్యాన్సీ  నెంబర్లకు ఎప్పుడూ క్రేజ్ కొనసాగుతోందరని ఈ వేలం మరోసారి నిరూపించింది. వాహనదారులు అభిరుచిని ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ క్యాష్ చేసుకుంది. దీంతో ఫ్యాన్సీ నెంబర్లు రవాణా శాఖకు కాసుల పంట పండింది. తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నెంబర్ వేలం ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మీరు స్టన్ అవ్వాల్సిందే. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఒక్కరోజే 53లక్షల 34వేల 894 ఆదాయం వచ్చింది. ఈ వేలంలో అత్యధికంగా టీఎస్ 09 జీసీ 9999 ఏకంగా 21లక్షల 60వేల పలికింది. దీనిని ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది.

ఇక ఏ నెంబర్ ఎంతకంటే?

  • TS 09 GC 9999 నెంబర్‌ను రూ. 21,60,000కు ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒడిసిపట్టింది
  • TS 09 GD 0009 నెంబర్‌ను రూ. 10,50,000కు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ దక్కించుకుంది.
  • TS 09 GD 0001 నెంబర్‌ను రూ. 3,01,000కు ఆంధ్రా ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది
  • TS 09 GD 0006 నెంబర్‌ను రూ. 1,83,000కు గాయజ్ జ్యువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.
  • TS 09 GD 0019 నెంబర్‌ను రూ. 1,70,100కు సితార ఎంటర్‌టైన్మెంట్ దక్కించుకుంది.
  • TS 09 GD 0045 నెంబర్ ను రూ. 1,55,000కు సాయి పృథ్వీ ఎంటర్‌ప్రైజెస్ దక్కించుకుంది.
  • TS 09 GD 0007 నెంబర్ ను రూ. 1,30,000కు ఫైన్ ఎక్స్‌పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వేలంలో కొనుగోలు చేసింది
  • TS 09 GD 0027 నెంబర్ ను రూ. 1,04,999కు శ్రీనివాస కన్‌స్ట్రక్చన్స్ దక్కించుకుంది.

మార్కెట్‌లోకి వచ్చిన కొత్త మోడల్ బండి తీయడమే కాదు.. దానికి ఫ్యాన్సీ నంబర్ కూడా ఉంటే.. ఆ కిక్కే వేరన్నది కొందరి వెర్షన్. అందుకే ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకునేందుకు లక్షలు పోస్తారు. కొన్ని సార్లు అయితే బండి ధర కంటే.. ఫ్యాన్సీ నంబర్ కోసం పెట్టిన ఖర్చే అధికంగా ఉంటుంది కూడా. ఎవరి ఇంట్రస్ట్ వాళ్లది. ఎవరి వెర్షన్ వాళ్లది. అంతే కదా..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..