Rohith Vemula Case: దళితుడని కలెక్టరే సర్టిఫికెట్‌ ఇచ్చారు.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక..

|

May 04, 2024 | 12:39 PM

జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య కేసు విషయం మళ్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అతను దళితుడే కాదని పోలీసులు రిపోర్ట్ ఇవ్వడంతో HCUలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయ్‌. దాంతో, రోహిత్‌ వేముల ఆత్మహత్యపై మరోసారి దుమారం రేగింది.

Rohith Vemula Case: దళితుడని కలెక్టరే సర్టిఫికెట్‌ ఇచ్చారు.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక..
Rohith Vemula Case
Follow us on

జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య కేసు విషయం మళ్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అతను దళితుడే కాదని పోలీసులు రిపోర్ట్ ఇవ్వడంతో HCUలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయ్‌. దాంతో, రోహిత్‌ వేముల ఆత్మహత్యపై మరోసారి దుమారం రేగింది. దీంతో రోహిత్ వేముల కేసును రీఓపెన్‌ చేయాలని తెలంగాణ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. పునర్విచారణ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రోహిత్ కేసు క్లోజ్ అయినట్టుగా పోలీసులు సమర్పించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం స్పందించటం, తిరిగి రీఓపెన్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. దీంతో రోహిత్ వేముల తల్లి రాధిక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రోహిత్ కేసును క్లోజ్ చేశారని.. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని రోహిత్ తల్లి రాధిక సీఎంను కోరారు. స్పందించిన రేవంత్ రెడ్డి.. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

నా కొడుకు దళితుడు కాదా..?

అనంతరం రోహిత్ తల్లి రాధిక టీవీ9తో మాట్లాడారు. రెండు నెలల క్రితమే కేసు క్లోజ్‌ చేశారంటూ పేర్కొన్నారు. తన కొడుకు దళితుడు కాదా..? అంటూ ప్రశ్నించారు. తన బిడ్డ దళితుడని కాకినాడ కలెక్టర్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారని పేర్కొన్నారు. రెండు నెలల క్రితమే కేసు క్లోజ్‌ చేశారని.. పోలీసుల దర్యాప్తు సరిగా లేదన్నారు. తమకు న్యాయం చేస్తామని సీఎం చెప్పారన్నారు. రోహిత్‌ది కచ్చితంగా హత్యే.. తన కొడుకుని చంపిన వారందరూ జైలుకు వెళ్లాలన్నారు. సోషల్‌ బాయికాట్‌పై దర్యాప్తు చేయాలని రాధిక డిమాండ్ చేశారు.

మళ్లీ ఆందోళనలు..

కాగా.. ఎనిమిదేళ్ల తర్వాత రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ తెరపైకొచ్చింది. 2016 జనవరి 17న HCUలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు రోహిత్‌. అప్పటి HCU వీసీతోపాటు బీజేపీ నేతల వేధింపుల కారణంగానే రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. దాంతో, రోహిత్‌ సూసైడ్‌పై ఆనాడు పెనుదుమారం రేగింది. అప్పుడు రాహుల్‌గాంధీ, కేజ్రీవాల్‌, వామపక్ష నేతలు HCUకి రావడంతో రోహిత్‌ ఆత్మహత్య ఘటన నేషనల్‌ ఇష్యూగా మారింది. జాతీయ మీడియా పెద్దఎత్తున కవరేజ్‌ ఇవ్వడంతో దేశం మొత్తం హైదరాబాద్‌ వైపు చూసింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయ్‌. కాగా.. రోహిత్‌ కేసును తాజాగా.. మూసివేయడంతో HCUలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయ్‌. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో భారీగా బలగాలను మోహరించారు పోలీసులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..