
రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. అది కూడా కేవలం జూన్ 10వ తేదీన మాత్రమే. ఈ మారిన టైమింగ్స్ ప్రయాణీకులు గమనించాల్సిందిగా రైల్వే అధికారులు కోరారు. సికింద్రాబాద్-విశాఖపట్నం(20834) వందేభారత్ రైలు.. ఇవాళ అనగా జూన్ 10న మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. రాత్రి 7 గంటలకు బయల్దేరుతుందని రైల్వే శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. పెయిరింగ్ ట్రైన్ ఆలస్యంగా నడుస్తుండటం వల్ల ఈ మార్పుకు కారణమని తెలిపింది. కాగా, ఈరోజు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. 4 గంటలు ఆలస్యంగా ఉదయం 9.45 గంటలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయల్దేరిన సంగతి తెలిసిందే.
Rescheduling of Vande Bharat Express
Train No. 20834 Secunderabad – Visakhapatnam Vande Bharat Express scheduled to depart SC at 15.00 hrs on 10.06.2023 is rescheduled to depart at 19.00hrs on the same day,due to late running of its pairing train. @RailMinIndia @drmsecunderabad— South Central Railway (@SCRailwayIndia) June 10, 2023