
హైదరాబాద్ వేదికగా 72 మిస్ వరల్డ్ పోటీలు (Miss World 2025) జరగనున్నాయి. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ ప్రతిష్ఠాత్మ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ పోటీల్లో 120 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ పర్యాటక శాఖ చకచక చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన బామలు హైదరాబాద్‌లో వాలిపోయారు. అయితే సోమవారం మరో మూడు దేశాలకు చెందిన అందగత్తెలు హైదరాబాద్ రానున్నారు. ఇవాళ పోర్చుగల్, ఘనా, ఐర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు శంషాబాద్ రానున్నారు. వీరికి పూర్తి సంప్రదాయ లాంఛనాలతో స్వాగతం పలికేందుకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ సన్నాహక, ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
ఈ పోటీల కోసం పోర్చుగల్‌కు చెందిన మారియా అమెలియా ఆంటోనియో, ఘనా నుంచి జుట్టా అమా పోకుహా అడ్డో, ఐర్లాండ్ కు చెందిన జాస్మిన్‌లు సోమవారం హైదరాబాద్ చేరుకోనున్నారు. అయితే మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జన్సెన్ వాన్ రెన్స్ బర్గ్ , మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేన్ద్రియుజ్య్ పెడ్రోసో ( Ms. Jessica Scandiuzzi Pedroso (Brazil), మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్‌లు ఇప్పటికే హైదరాబాద్‌కి చేరుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..