ఆస్తి కోసం కన్న కొడుకే సుపారీ ఇచ్చి తండ్రిని మర్డర్ చేయించాడు. రియల్టర్ కమ్మరి కృష్ణ మర్డర్ కేసు విచారణలో ఈ షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. కమ్మరి కృష్ణ బాడీగార్డ్ బాబాతోనే కొడుకు శివ మర్డర్ చేయించాడు. కన్న తండ్రిని హత్య చేయడానికి కొడుకు శివ సుపారీ ఇచ్చాడు. కమ్మరి కృష్ణను హత్య చేస్తే రూ25 లక్షల నగదుతో పాటు ఇల్లు కట్టిస్తానని బాడీగార్డ్ బాబాతో శివ సుపారీ కుదుర్చుకున్నాడు. కమ్మరి కృష్ణ హత్య కేసులో నలుగురు నిందితులను షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన మూడు కత్తులు, రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి తగాదాలే కమ్మరి కృష్ణ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. కమ్మరి కృష్ణకు ముగ్గురు భార్యలున్నారు. మొదటి భార్య కుమారుడు శివ.. తండ్రిని చంపించినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కమ్మరి కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. ముందు నుంచి తండ్రి కమ్మరి కృష్ణతో శివకు ఆస్తి తగాదాలున్నాయి. దీంతో పాటు మూడో భార్య పావని పేరుతో కమ్మరి కృష్ణ ఆస్తులు కొనుగోలు చేస్తున్నాడని కోపం పెంచుకున్నాడు. మొత్తం ఆస్తిని మూడో భార్య పావనికే రాసేస్తాడనే అనుమానంతో తండ్రి హత్యకు ప్లాన్ చేసి హతమార్చాడు.
జులై10న షాద్‌నగర్ సమీపంలో కుమారుడు శివ కమ్మరి కృష్ణను హత్య చేయించాడు. హత్యలో ప్రధాన నిందితుడు బాబా కమ్మరి కృష్ణకు బాడీగార్డ్‌గా 2015-2020 వరకు పనిచేశాడు. శివ ప్లాన్ ప్రకారమే హత్య కుట్రలో భాగంగా బాబా మళ్లీ కమ్మరి కృష్ణ వద్ద బాడీగార్డ్‌గా చేరాడు. హత్య చేసేందుకు బాబా శివానంద, గణేష్‌తో పాటు ఓ వమైనర్‌ను వెంట తెచ్చుకున్నాడు. పథకం ప్రకారమే జులై 10 న కేకే ఫామ్ హౌస్‌కు కమ్మరి కృష్ణను తీసుకొచ్చారు. ఎవరూ లేని సమయంలో నిందితులు ముగ్గురూ కమ్మరి కృష్ణని పట్టుకొని గొంతు కోసి చంపేసారు.
కమ్మరికృష్ణ హత్య కేసులో నలుగురు నిందితులను కాళీ మందిర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిజికల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి త్వరలో ఈ కేసులో ఛార్జ్ షీట్ వేస్తామని నిందితులకు శిక్ష పడేలా చూస్తామని షాద్ నగర్ డీసీపీ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..