Hyderabad: హైదరాబాద్ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో నగరంలో పలు చోట్ల కాలనీలన్నీ నీటితో మునిగిపోయాయి. మోకాల్లోతు నీటిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలైన పరిగి, వికారాబాద్ చేవెళ్లలో కురుస్తోన్న భారీ వర్షాలకు జలాశయాలైన గండిపేట్, హిమాయత్ సాగర్‌కు వరద పోటేత్తుతోంది. దీంతో నగరంలోని పలు చోట్ల బిడ్జిలపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే కొందరు అత్యుత్సాహంతోనో లేదా వరద నీటిని సరిగ్గా అంచనా వేయలేకో నీటిలో నుంచే వాహనాలను పోనిస్తున్నారు. దీంతో వరద వేగానికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. తాజాగా మంగళవారం సాయంత్రం హిమాయత్ సాగర్‌లో ఇలాంటి ఓ సంఘటన జరిగింది. వరద నీరు నన్ను ఏం చేస్తుందిలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఓ యువకుడు నీటిలో చిక్కుకుపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సైబర్‌బాద్ పోలీసులు కష్టంతో ఆ కుర్రాడిని బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈరోజు సాయంత్రం హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు వంతెన పైనుంచి వరద నీరు పారుతున సందర్భంలో బైక్ పై వంతెన దాటడానికి ప్రయత్నించిన ఒక యువకుడు వరదకు కొట్టుకుపోతున్నప్పుడు వెంటనే స్పందించి యువకుణ్ణి కాపాడిన రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులు. @TelanganaDGP @TelanganaCOPs @CYBTRAFFIC pic.twitter.com/94NLdbVpDQ
— Cyberabad Police (@cyberabadpolice) July 26, 2022
వరదలో నీటిలో ఇరుకున్న యువకుడిని రక్షించే క్రమంలో తీసిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోతో పాటు.. ‘మంగళవారం సాయంత్రం హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు వంతెన పై నుంచి వరద నీరు వెళ్తొన్న సమయంలో… ఓ యువకుడు బైక్‌తో వంతెన దాటడానికి ప్రయత్నించాడు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బైక్ నీటిలో కొట్టుకుపోతున్న విషయాన్ని గమనించిన రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులు యువకుడిని కాపాడారు’ అంటూ ట్వీట్ చేశారు.
మరిన్ని హైదారాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..