హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీ కలకలం.. రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ అరెస్టు!

Hyderabad Drugs Party: గచ్చిబౌలిలో సోమవారం డ్రగ్స్ పార్టీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పాల్గొన్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లలో మల్నాడు డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న విక్రమ్ కూడా ఉన్నాడు. ఇతడితోపాటు రాజమండ్రికి చెందిన తేజ, నీలిమ, మణిదీప్‌ అనే మరో ముగ్గురు..

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీ కలకలం.. రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ అరెస్టు!
Hyderabad Drugs Party

Updated on: Aug 26, 2025 | 1:36 PM

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 26: హైదరాబాద్‌ గచ్చిబౌలిలో సోమవారం డ్రగ్స్ పార్టీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పాల్గొన్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లలో మల్నాడు డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న విక్రమ్ కూడా ఉన్నాడు. ఇతడితోపాటు రాజమండ్రికి చెందిన తేజ, నీలిమ, మణిదీప్‌ అనే మరో ముగ్గురు పట్టుబడ్డారు. ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ అయిన మణిదీప్‌ అనే వ్యక్తి రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్‌ కావడం విశేషం. ఈ నలుగురిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి మల్నాడు డ్రగ్స్‌ కేసు నిందితులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో డ్రగ్స్‌ పార్టీ జరుగుతుందని పక్కా సమచారం అందడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ పార్టీలో డ్రగ్స్‌ వాడుతున్నట్లు తెలియడంతో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన నీలిమ.. రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్‌, మరో ఇద్దరిని అదుపులోకి స్టేషన్‌కు తరలించారు. వీరి నుంచి నుంచి 20 గ్రాముల కొకైన్‌, నాలుగు గ్రాములు ఎండీఎంఏ, 20 ఎక్స్‌టీసీ పిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితులు బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.

కాగా రాష్ట్రంలో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వ్యవహారంలో అధికారులు ఎప్పటికప్పుడు చురుకుగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఎందరినో అరెస్ట్‌ చేసిన అధికారులు తాజాగా గచ్చిబౌలిలో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్‌ పార్టీ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.