రెయిన్ అలర్ట్: హైదరాబాద్…బీ కేర్‌ఫుల్

|

Sep 29, 2019 | 3:13 PM

కొన్ని రోజులుగా హైదరబాద్ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికి జలదిగ్బందనంలోనే ఉన్నాయి. డ్రైనేజ్‌ లీకై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులు అటాక్ అవుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతోంది. కాగా ఆదివారం కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నగరంలో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, బయటకు […]

రెయిన్ అలర్ట్: హైదరాబాద్...బీ కేర్‌ఫుల్
Follow us on

కొన్ని రోజులుగా హైదరబాద్ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికి జలదిగ్బందనంలోనే ఉన్నాయి. డ్రైనేజ్‌ లీకై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులు అటాక్ అవుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతోంది. కాగా ఆదివారం కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

నగరంలో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, బయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్న ఆయన.. ప్రయాణాలు చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షం కారణంగా ఇబ్బంది తలెత్తితే డయల్ 100కు కాల్ చేయాలని, 24 గంటలూ పోలీసులు సాయం చేస్తారని హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు.

మరోవైపు ఏపీ, తెలంగాణతో పాటు భారీ వర్షాలు ఉత్తరాదిని సైతం వణికిస్తున్నారు. బీహార్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు బీహార్, యూపీ అతలాకుతలం అయ్యాయి. ఇటు ఎన్టీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి.