Hyderabad: ఇదో విచిత్రమైన డిమాండ్.. వర్క్ ఫ్రం హోమ్ రద్దు చేయాలంటూ హైదరాబాద్‌లో హాస్టల్ ఓనర్ల ధర్నా..

| Edited By: Shaik Madar Saheb

Aug 31, 2024 | 12:29 PM

కరోనా కాలం ముగిసి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఇంకా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ వెసలుబాటు కల్పిస్తున్నాయి. దీంతో చాలా కంపెనీల ఐటి ఉద్యోగులు ఇప్పటికీ.. తమ సొంత ఊర్లలో కూర్చొని పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తప్పనిసరిగా ఆఫీస్ లకు పిలుస్తున్నప్పటికీ.. మరికొన్ని కంపెనీలు వారంలో మూడు రోజులు.. ఆఫీస్ కు వచ్చేలా ఆదేశాలిచ్చాయి..

Hyderabad: ఇదో విచిత్రమైన డిమాండ్.. వర్క్ ఫ్రం హోమ్ రద్దు చేయాలంటూ హైదరాబాద్‌లో హాస్టల్ ఓనర్ల ధర్నా..
It Employees (representative image)
Follow us on

కరోనా కాలం ముగిసి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఇంకా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ వెసలుబాటు కల్పిస్తున్నాయి. దీంతో చాలా కంపెనీల ఐటి ఉద్యోగులు ఇప్పటికీ.. తమ సొంత ఊర్లలో కూర్చొని పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తప్పనిసరిగా ఆఫీస్ లకు పిలుస్తున్నప్పటికీ.. మరికొన్ని కంపెనీలు వారంలో మూడు రోజులు.. ఆఫీస్ కు వచ్చేలా ఆదేశాలిచ్చాయి.. ఇంకొన్ని కంపెనీలు అయితే.. నిర్వహణ భారం, ఖర్చు తగ్గుతుందన్న కారణాలతో ఇంకా వర్క్ ఫ్రమ్ హోం కంటిన్యూ చేస్తున్నాయి.. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు… రోడ్డెక్కారు.. కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఇవ్వడం వల్ల తాము చాలా నష్టపోతున్నామంటూ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు. వర్క్ ఫ్రం హోం కారణంగా హాస్టల్స్ లో ఎవరు ఉండకపోవటంతో తమకు కనీసం ఈఎంఐ కట్టుకోలేని స్థితిలో ఉన్నామని చాలామంది హాస్టల్ నిర్వాహకులు వాపోతున్నారు.

ఇందులో భాగంగా పోచారం ఐటీ కారిడార్ లో పలు కంపెనీల ముందు హాస్టల్స్ నిర్వాహకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు ఉద్యోగులకు సంవత్సరాల తరబడి వర్క్ ఫ్రం హోం ఇవ్వటాన్ని హాస్టల్స్ నిర్వాహకులు వ్యతిరేకిస్తున్నారు. లక్షల రూపాయలు లోన్లు తీసుకుని భవనాన్ని నిర్మించి హాస్టల్స్ నడిపిస్తూ ఉన్నామని.. కానీ సంస్థలు వర్క్ ఫ్రం హోమం ఇవ్వడంతో హాస్టల్స్ అన్ని ఖాళీగా ఉంటున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఒకప్పుడు రెండు లక్షలు వచ్చే ఇన్కమ్ ప్రస్తుతానికి 30 వేలకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడం వల్ల సంస్థలకు కలిసి వస్తుండటంతో.. ఐటీ సంస్థలు సైతం ఆఫీసుకు రావాలని ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం లేదు. ఇంటర్నెట్ సదుపాయంతో పాటు ఆఫీస్ రెంట్ కరెంట్ బిల్ లాజిస్టిక్స్ ఇలా రకరకాల ఖర్చులతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఉద్యోగులు తమ ఇంటి నుంచే పని చేస్తే ఈ ఖర్చులు మొత్తం సేవ్ అవుతాయని చాలా సంస్థలు భావిస్తున్నాయని.. హాస్టల్స్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంస్థలకు ప్రభుత్వమే భూములను కేటాయించి వారికి సబ్సిడీ కూడా ఇస్తున్నప్పటికీ.. కొన్ని బడా సంస్థలు ఇప్పటికే ఇంకా వర్క్ ఫ్రొం హోమ్ ఇవ్వడం సమంజసం కాదని ప్రేవేట్ హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పోచారం ఐటీ కారిడార్ లో దాదాపు 700 రూపాయల అపార్ట్‌మెంట్లను హాస్టల్స్ రూపంలో మార్చి నిర్వహిస్తున్నారు. జీడిమెట్లతోపాటు ఉప్పల్ ప్రాంతంలో మరో 200 హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా పోచారంలో ఉన్న ఐటీ సెక్టార్‌లో పనిచేసే ఐటీ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసుకున్నవేనని.. కానీ ఇప్పుడు వారికి నిరంతరం వర్క్ ఫ్రం కారణంగా తాము తీసుకున్న లోన్లలో కనీసం ఈఎంఐ కూడా చెల్లించలేకపోతున్నామని హాస్టల్స్ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారం పై త్వరలోనే ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి వినతి పత్రాన్ని ఇస్తామని చెబుతున్నారు.

కోవిడ్ కాలంలో చాలా ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అదే వర్క్ ఫ్రం హోం ఇప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పలు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని అవలంభిస్తున్నాయి. ఈ తరుణంలో వర్క్ ఫ్రం హోం రద్దుచేసి ఉద్యోగులను కచ్చితంగా ఆఫీస్ కి వచ్చి పని చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హాస్టల్స్ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..