
హైదరాబాద్, జూన్ 16: ఇవాళ హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రానున్నారు. విమానశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్ చేరుకుని అక్కడ బస చేయనున్నారు. శనివారం దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చేరుకుంటారు. అక్కడ జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరవుతారు. భారత వైమానిక దళంలోని వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్‌ల ఛాలెంజింగ్ ప్రీ-కమిషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు గుర్తుగా, 211వ కోర్సు యొక్క CGP పూర్తి సైనిక వైభవంతో నిర్వహించబడుతుంది, రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పరేడ్ కార్యక్రమం తర్వాత శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డులు అదజేయనున్నారు.
జూన్ 17న దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (ఎసిఎ)లో జాయింట్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సిజిపి)ని రాష్ట్రపతి పరిశీలిస్తారు. హైదరాబాద్ నగరంలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. శుక్ర, శని వారాల్లో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. సీటీవో జంక్షన్, పీఎన్టీ ఫ్లైఓవర్ జంక్షన్, బేగంపేట్ హెచ్.పి.ఎస్ అవుట్ గేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, వీవీ విగ్రహం జంక్షన్, పంజగుట్ట జంక్షన్, ఎన్.ఎఫ్.సి.ఎల్ జంక్షన్లలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ రూల్స్ అమలులో ఉంటాయి. అదేవిదంగా తిరిగి శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ నిబంధనలు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం