సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇందు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. ఆ తర్వాత మృతదేహాన్ని జవహర్‌నగర్‌కు అంబులెన్స్‌లో తరలించారు. ఇందు మృతిపై పోస్టుమార్టం రిపోర్ట్ కీలకం కానుంది. బాలిక ఉపిరితిత్తుల్లో నీరు గుర్తించారు డాక్టర్లు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని నిర్ధారించారు. చెరువు నీరు తాగి బాలిక చనిపోయిందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. పోస్టుమార్టం చేసే సమయంలో చిన్నారి మేనమామ సైతం అక్కడే ఉన్నారు. బాలిక చెరువులో ఎలా పడిందన్న దానిపై ఇంకా మిస్టరీ వీడలేదు. చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయిందా..? లేక ఎవరైనా తోసేసారా..? అన్నది తేలాల్సి ఉంది. కాగా దమ్మాయిగూడ సర్కిర్ వద్ద ఉద్రికత్త నెలకుంది. ఇందు తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పోస్ట్‌మార్టం కాపీ తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులతో స్టానికులు వాగ్వాదానికి దిగారు. ఇందు మృతిపై క్లారిటీ ఇవ్వాలని.. నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గాంధీ ఆస్పత్రి దగ్గర కాంగ్రెస్ మహిళా నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. ఇందు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో మహిళ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలు గురువారం ఏం జరిగింది..?
గురువారం ఉదయం సంతోషంగా స్కూల్‌కి వెళ్లిన ఇందు…శుక్రవారం ఉదయం చెరువులో శవమై తేలింది. ఇంతకీ ఇందు ఎలా చనిపోయింది?. ఇందు డెత్ వెనకున్న మిస్టరీ ఏంటి?. అసలు, ఆ 24గంటల్లో ఏం జరిగింది?.
– డిసెంబర్ 15, ఉదయం 8:30 – ఇంటి నుంచి స్కూల్‌కి వెళ్లింది ఇందు, తండ్రి స్వయంగా ఆమెను స్కూల్ దగ్గర విడిచిపెట్టాడు
– ఉదయం 9గంటలు – స్కూల్ లోపలికి వెళ్లిన ఇందు… క్లాస్ రూమ్‌కి కూడా వెళ్లింది
– ఉదయం 9:20 – క్లాస్ రూమ్‌కి వెళ్లిన కాసేపటికే… స్కూల్ నుంచి బయటికి వచ్చింది ఇందు. ఆడుకోవడానికి పార్క్‌కి వెళ్తున్నట్టు ఫ్రెండ్స్‌కి చెప్పింది.
– ఉదయం 10:20 – గంటైనా స్కూల్‌కి తిరిగిరాలేదు… అటెండెన్స్ తీసుకోవడంతో ఇందు లేనట్టు గుర్తించింది టీచర్.
– ఉదయం 10:22 – ఇందు అబ్సెంట్‌పై స్కూల్ ప్రిన్సిపల్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది టీచర్
– ఉదయం 10:25 – ఇందు కోసం స్కూల్ పరిసరాల్లో వెదికారు టీచర్లు
– ఉదయం 10:30 – ఇందు కనిపించకపోవడంతో పేరెంట్స్‌కి సమాచారం ఇచ్చారు టీచర్స్
– ఉదయం 11గంటలు – ఇందు కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు తల్లిదండ్రులు
– మధ్యాహ్నం 12గంటలు – పోలీసుల సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం
– సాయంత్ర 4గంటలు – దమ్మాయిగూడ చెరువు దగ్గర గాలింపు
– సాయంత్ర 6గంటలు – డాగ్ స్క్వాడ్‌తో చెరువు పరిసరాలు చెకింగ్
– సాయంత్రం 6:30 – చెరువు దగ్గర దొరకని ఇందు ఆచూకీ
– డిసెంబర్ 16, ఉదయం 9గంటలు – ఇందు కోసం రెండో రోజు మళ్లీ గాలింపు
– ఉదయం 9:30 – సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన
– ఉదయం 10గంటలు – సీసీ ఫుటేజ్‌లో ఇందు ఆచూకీ లభ్యం, గురువారం 10AM నుంచి చెరువు పరిసరాల్లోనే ఇందు
– ఉదయం 11గంటలు – చెరువు దగ్గర ఇందు మృతదేహం లభ్యం
బిడ్డ కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులు చనిపోయిందనే వార్తతో తల్లడిల్లిపోయారు. కన్నీరుమున్నీరు అవుతున్నారు. గురువారం చెరువు దగ్గర ఒక వ్యక్తికి ఇందు కనిపించింది. పుస్తకాల కోసం వెళ్తున్నానని చెప్పింది ఆ బాలిక. అదే ప్రదేశంలో బాలిక మృతదేహం దొరకడం విషాదంగా మారింది. బాలిక మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఇందూ మరణం వెనక కారణంపై పోలీసులు అన్వేషిస్తున్నారు. కేసు విచారణ కోసం 4 బృందాలు ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..