Drugs Case: డ్రగ్‌ పెడ్లర్‌ మోహిత్‌కు ఒకరోజు కస్టడీ.. బయటపడనున్న డ్రగ్స్ సరఫరాదారుల బండారం

|

Jan 05, 2023 | 9:30 AM

మోహిత్ సెల్​ఫోన్​లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్​ను సేకరించారు. మోహిత్​ను ప్రశ్నించడం ద్వారా వాళ్లతో అతనికి ఉన్న సంబంధాల గురించి తెలుసుకోవాలని

Drugs Case: డ్రగ్‌ పెడ్లర్‌ మోహిత్‌కు ఒకరోజు కస్టడీ.. బయటపడనున్న డ్రగ్స్ సరఫరాదారుల బండారం
Drugs Case
Follow us on

డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన మోహిత్‌ను కాసేపట్లో పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్నారు. మోహిత్​కు దాదాపు 50మంది ప్రముఖులతో పరిచయాలున్నట్లు నార్కోటిక్ విభాగం పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు మోహిత్ సెల్​ఫోన్​లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్​ను సేకరించారు. మోహిత్​ను ప్రశ్నించడం ద్వారా వాళ్లతో అతనికి ఉన్న సంబంధాల గురించి తెలుసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ నటి నేహ భర్త అయిన మోహిత్ ఇంటర్నేషనల్ డీజే నిర్వాహకుడిగా కూడా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో హైదరాబాద్​లోని పలు పబ్బులలో పార్టీలు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది నవంబర్​లో గోవా మాదక ద్రవ్యాల స్మగ్లర్​ ఎడ్విన్​​ను అరెస్ట్ చేసినప్పుడు మోహిత్ బండారం బయటపడింది. ఎడ్విన్ ద్వారా మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసిన మోహిత్ వాటిని పబ్బులలో సరఫరా చేసినట్లు నార్కోటిక్ విభాగం పోలీసులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు మోహిత్​తో పాటు పోలీసులకు దొరికిపోయిన స్థిరాస్తి వ్యాపారి కృష్ణ కిశోర్​కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణ కిశోర్​ గోవా, ముంబయి, బెంగళూర్ నుంచి మాదక ద్రవ్యాలను తెప్పించుకొని వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో కృష్ణ కిశోర్​చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్‌ అవుతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం