Hyderbad: చదివింది బీటెక్‌ చేసేది మోసం.. ఏకంగా రూ. 60 లక్షలు కొట్టేశాడు.

|

Nov 19, 2024 | 8:40 AM

రోజురోజుకీ నేరాల శైలి మారిపోతోంది. టెక్నాలజీని ఆసరగా మార్చుకొని డబ్బులు కాజేస్తున్నారు. టెక్నికల్ డిగ్రీలు చదివి, ఆ తెలివిని మోసాలకు ఉపయోగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి ఓఎల్ఎక్స్ పేరుతో మోసం చేసి ఏకంగా రూ. 60

Hyderbad: చదివింది బీటెక్‌ చేసేది మోసం.. ఏకంగా రూ. 60 లక్షలు కొట్టేశాడు.
Representative Image
Follow us on

ప్రస్తుతం ఈజీ మనీ కోసం వెంపర్లాడే వారి సమస్య పెరుగుతోంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. ఇందుకోసం అక్రమ మార్గం ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ బీటెక్‌ విద్యార్థి ఇలాంటి మార్గాన్నే ఎంచుకున్నాడు. ఓఎల్‌ఎక్స్‌ను వేదికగా మార్చుకొని ఏకంగా రూ. 60 లక్షలు కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు.

వివరాల్లోకి వెళితే.. తిరుపతి పట్టణానికి చెందిన ఎం. బాలాజీ నాయుడు (35) ఎస్‌వీ యూనివర్సిటీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులు పాటు ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అతని తీరు సరిగా లేని కారణంగా బాలాజీని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసగా మారి అప్పులు చేశాడు. భర్త తీరు నచ్చకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

దీంతో ఓఎల్‌ఎక్స్‌ను వేదికగా మార్చుకొని మోసాలకు దిగడం ప్రారంభించాడు. ఇందుకోసం ముందుగా ఓఎల్‌ఎక్స్‌లో ఖరీదైన సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ను సెలక్ట్‌ చేసుకునేవాడు. విక్రయిస్తానని యజమానులను సంప్రదించేవాడు. ఎలాగో ఫోన్‌ కొనుగోలు చేస్తా కదా యాప్‌ నుంచి ఫోన్‌ ఫొటో తీసేయమని యజమానితోనే తీయించేవాడు. అయితే అంతలోపే ఫోన్‌ ఫొటోను అతడు డౌన్‌లోడ్‌ చేసుకునే వాడు. అసలు యజమాని చెప్పిన ధరకంటే తక్కువ రేటుకు ఆ ఫోన్‌ సొంతం చేసుకోవచ్చంటూ ఓఎల్‌ఎక్స్‌లో పోస్ట్‌ చేసేవాడు.

ఫోన్‌ను పరిశీలించాక డబ్బులు ఇస్తానని యజమాలను తాను చెప్పిన ప్రదేశానికి రమ్మనేవాడు. ఫోన్‌ను తీసుకునేందుకు తన సోదరుడు వస్తాడని చెప్పేవాడు. అయితే తన వద్ద ఫోన్‌ కొనేందుకు ఓకే అన్న వారికి మాత్రం తానే వస్తానని తెలిపేవాడు. ఫోన్‌ తీసుకుంటున్న వారి నుంచి ముందుగానే ఒత్తిడి చేసి యూపీఐ ద్వారా డబ్బులు పంపించుకునే వాడు. ఫోన్‌ అమ్మేందుకు వెళ్లిన వ్యక్తులు కొనేందుకు వచ్చిన వారిని డబ్బు చెల్లించమని అడిగినపుడు అసలు విషయం తెలిసేది.

తాను అప్పటికే డబ్బు చెల్లించానంటూ ఒకరు, నగదు జమకాలేదంటూ మరొకరు తెలుసుకునేలోపు బాలాజీ ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసి అక్కడి నుంచి జంప్‌ అవుతాడు. బాధితుల ఫిర్యాదుతో ఓఎల్‌ఎక్స్‌ బాలాజీ నెంబర్‌ను బ్లాక్‌లో పెట్టింది. దీంతో ఏకంగా 23 సిమ్‌ కార్డులను మార్చాడు. ఇలా ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఏకంగా 200 మందిని మోసం చేసి ఏకంగా రూ. 60 లక్షలు కాజేశాడు. ఫిర్యాదులు ఎక్కువగా కావడం, నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌కు 138 మంది బాధితులు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఉదయం ఎర్రమంజిల్‌ ప్రాంతంలో పోలీసులు బాలాజీని అరెస్ట్‌ చేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..