PM Modi: ‘ఇకపై యుద్ధం రసవత్తరంగా ఉంటుంది’.. తెలంగాణ గడ్డపై ప్రధాని మోదీ గర్జన..

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరొక లెక్క! తెలంగాణ గడ్డపై మోదీ గర్జించారు..! సూటిగా..ఘాటుగా..చెప్పాల్సింది చెప్పేశారు. ఇవ్వాల్సిన వార్నింగ్‌లు ఇచ్చేశారు.!

PM Modi: ఇకపై యుద్ధం రసవత్తరంగా ఉంటుంది.. తెలంగాణ గడ్డపై ప్రధాని మోదీ గర్జన..
Pm Narendra Modi

Updated on: Nov 12, 2022 | 9:20 PM

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరొక లెక్క! తెలంగాణ గడ్డపై మోదీ గర్జించారు..! సూటిగా..ఘాటుగా..చెప్పాల్సింది చెప్పేశారు. ఇవ్వాల్సిన వార్నింగ్‌లు ఇచ్చేశారు.! అసలైన ఆట మొదలైందన్నారు. ఇకపై యుద్ధం రసవత్తరంగా ఉంటుందంటూ సమరానికి సై అన్నారు.! శంఖారావం పూరించారు. నేరుగా ఎవరి పేరు ఎత్తలేదు. ఏ పార్టీని ప్రస్తావించలేదు. అయితేనేం చేరాల్సిన వాళ్లకు చేరిపోయేలా సాగింది మోదీ స్పీచ్. ఆయన మాటల్లో అధికారంలోకి రావడం ఖాయమనే ధీమా కనిపించిది.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముందే రాష్ట్రంలో పొలిటికల్‌గా చాలా హీట్‌ జనరేట్‌ అయింది. ఇప్పుడు తన కామెంట్స్‌తో ఆ హీట్‌ను పీక్‌ స్టేజ్‌కు చేర్చారు ప్రధాని మోదీ..! రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీతోపాటు..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం వచ్చారు మోదీ. అయితే బేగంపేట ఎయిర్‌పోర్టులో జరిగిన సభ మాత్రం పూర్తిగా పొలిటికల్..! అరగంట స్పీచ్‌ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, కుటుంబపాలన చుట్టూనే తిరిగింది.! ఓవైపు పదునైన విమర్శలు చేస్తూనే.. మరోవైపు కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తెలంగాణలో కమలవికాసం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేశారు.

గతంతో పోలిస్తే మోదీ స్పీచ్‌ కాస్త డిఫరెంట్‌గానే సాగిందని చెప్పొచ్చు.! పరోక్షంగానే ఇవ్వాల్సిన వార్నింగ్‌లు అన్నీ ఇచ్చారు..! తెలంగాణ పేరుతో అధికారం పొంది కొందరు తమ జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు..! పేదలను దోచుకుతినే అవినీతి పరుల భరతం పడతామని హెచ్చరించారు. తెలంగాణలో కుటుంబ పాలనపోయిన, బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. ఫ్యామిలీ ఫస్ట్ అనే భావన పోయి … పీపుల్ ఫస్ట్ అనే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు.

తనపై వస్తున్న విమర్శలపైనా స్పందించారు మోదీ..! ప్రతి రోజూ టార్గెట్ చేస్తూనే ఉంటారు. వెరైటీ తిట్లు అన్నీ తిడుతారు. నేను పట్టించుకోను..మీరూ పట్టించుకోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. అయితే ప్రజల ఆకాంక్షలతో చెలగాటం ఆడితే మాత్రం ప్రతిఘటన తప్పదన్నారు మోదీ. మూఢనమ్మకాలపైనా తనదైన శైలిలో పంచ్‌లు పేల్చారు మోదీ..! ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో అంధవిశ్వాసాలను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణలో ఇప్పటికే హైవోల్టేజ్‌ హీట్‌ కంటిన్యూఅవుతోంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య పచ్చగడ్డికూడా వేయకుండానే భగ్గుమనే పరిస్థితి. ఇప్పుడు మోదీ చేసిన ఘాటు విమర్శలతో ఈ వార్‌ నెక్ట్‌లెవల్‌కు వెళ్లినట్లైంది.! ఇక యుద్ధం రసవత్తరంగా ఉంటుంది. కాచుకోండి అంటూ బేగంపేట్‌లో వార్నింగ్‌తో మొదలైన మోదీ స్పీచ్… ఈ రోజు హైదరాబాద్‌లో ఉండే వాళ్లకు నిద్ర కూడా పట్టదన్న పంచ్‌తో రామగుండంలో ముగిసింది. మరి ఈ టూర్‌ తాలూకు రియాక్షన్స్‌ ఎలా ఉంటాయి? ఇకపై తెలంగాణలో బీజేపే వ్యూహం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరం.