పటాన్‌చెరులో బీజేపీ భారీ బహిరంగ సభ.. ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ప్రధాని మోదీ

|

Mar 05, 2024 | 12:37 PM

ప్రధాని నరేంద్ర మోదీ వరుస పర్యటనలతో తెలంగాణలో పొలిటికల్‌గా హీట్‌వేవ్‌ నడుస్తోంది. సమ్మర్‌ ఇప్పుడిప్పుడే స్టార్ట్‌ అవుతున్నా.. ఎలక్షన్‌ సీజన్‌ మాత్రం మంటెక్కుతోంది. నిన్న ఆదిలాబాద్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. పవర్‌ఫుల్‌ పంచ్‌లతో రెండు పార్టీలకూ చెమటలు పట్టిస్తున్నారు.

పటాన్‌చెరులో బీజేపీ భారీ బహిరంగ సభ.. ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ప్రధాని మోదీ
Pm Modi

ప్రధాని నరేంద్ర మోదీ వరుస పర్యటనలతో తెలంగాణలో పొలిటికల్‌గా హీట్‌వేవ్‌ నడుస్తోంది. సమ్మర్‌ ఇప్పుడిప్పుడే స్టార్ట్‌ అవుతున్నా.. ఎలక్షన్‌ సీజన్‌ మాత్రం మంటెక్కుతోంది. నిన్న ఆదిలాబాద్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. పవర్‌ఫుల్‌ పంచ్‌లతో రెండు పార్టీలకూ చెమటలు పట్టిస్తున్నారు. నిన్న తెలంగాణతోపాటు.. తమిళనాడులో పర్యటించి.. తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇక ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ. బేగంపేట ఎయిర్ పోర్టులో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆయనను రిసీవ్‌ చేసుకున్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి అక్కడే బసచేశారు. ఈరోజు ఉదయం 8 గంటలనుంచి మళ్లీ మోదీ షెడ్యూల్‌ ప్రారంభం కాబోతోంది. సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయంలో అమ్మవారికి దర్శించుకోనున్నారు. అక్కడ పూజల అనంతరం నేరుగా సంగారెడ్డి జిల్లాకు వెళ్తారు. ఉదయం పదిగంటలకు సంగారడ్డి వెళ్తారు. 10.40కి ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉదయం 11.20కి పటాన్‌చెరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ప్రధాని మోదీ. ఇవాళ మరోసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ స్టేజి పంచుకోనున్న సంగతి తెలిసిందే.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Mar 2024 12:34 PM (IST)

    ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

    కొందరు నల్లధనం దాచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు

    ఓ వర్గం తమ కుటుంబాలకు విలాస భవనాలు కట్టించింది

    నేను మాత్రం పేదలకు నాలుగు కోట్ల ఇళ్లు కట్టించాను- మోదీ

    అందుకే నాకు కుటుంబం లేదని వీళ్లు విమర్శిస్తున్నారు

    140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం

    దేశంలోని ప్రతి చెల్లి, ప్రతి తల్లి నా కుటుంబమే- మోదీ

    ఇండి కూటమికి ఇది అర్థం కావడం లేదు

    అందుకే నేను మోదీ కుటుంబసభ్యుడిని అని అందరూ అంటున్నారు

    మా పథకాల్లో ఎక్కువ లబ్ది పొందింది మహిళలే

    మాదిగల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకున్నాం

    మాదిగల సమస్యలు అర్థం చేసుకున్నాం

    బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ ఒక్కటే

    ఈ రెండు పార్టీలు నాణానికి రెండు వైపులు

    బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య చీకటి బంధం ఉందా.. లేదా?

    బీఆర్ఎస్‌ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేల కోట్లు దండుకుంది

    కాంగ్రెస్‌ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది- మోదీ

    రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి

    ఈ రెండు పార్టీలు ఒకే గూటి పక్షులు

  • 05 Mar 2024 12:32 PM (IST)

    ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

    కుటుంబాలు బాగుపడ్డాయి కానీ ప్రజలు బాగు పడలేదు

    కుటుంబ వాదాన్ని నేను వ్యతిరేకిస్తున్నా

    కుటుంబ వాదం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోంది

    కుటుంబ వాదులకు దోపిడీ చేసే లైసెన్స్ ఉందా..?

    నాకు అసలు కుటుంబమే లేదని విమర్శిస్తున్నారు

    తమ కుటుంబమే ముఖ్యమని కొందరు నేతలు అంటారు

    నాకైతే దేశమే ముఖ్యం- మోదీ

    ఆ నేతలకు తమ కుటుంబాలే ముఖ్యం.

    నాకు మాత్రం దేశంలోని ప్రతి కుటుంబం ముఖ్యం- మోదీ

    ఆ నేతలు దేశంలో ఎంతో మందిని రాజకీయంగా ఎదగనివ్వలేదు

    యువకులకు కాకుండా వృద్ధులకు మాత్రమే వారు అవకాశం ఇస్తారు

    కుటుంబవాదులు తమ ఖజానా నింపుకుంటారు

    కొందరు నేతలు (లాలూ) గిఫ్ట్‌లు తీసుకొని ఖజానా నింపుకుంటున్నారు

    వారి దొంగ సొత్తును బయటికి తీస్తున్నా

    మీరు (ప్రజలు) తలదించుకునేలా చేయబోను

  • 05 Mar 2024 12:31 PM (IST)

    కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

    బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ ఒక్కటే

    ఈ రెండు పార్టీలు నాణానికి రెండు వైపులు- మోదీ

    బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య చీకటి బంధం ఉందా.. లేదా?

    బీఆర్ఎస్‌ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేల కోట్లు దండుకుంది

    బీఆర్ఎస్‌ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేల కోట్లు దండుకుంది

    కాంగ్రెస్‌ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది- మోదీ

    రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి

    ఈ రెండు పార్టీలు ఒకే గూటి పక్షులు

  • 05 Mar 2024 11:29 AM (IST)

    ప్రధాని మోదీ స్పీచ్ హైలైట్స్

    తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు నరేంద్ర మోదీ. రాష్ట్ర అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమని చెప్పారు మోదీ. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు మోదీ. ఈ సంస్థ వల్ల తెలంగాణ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు పేర్కొన్నారు. వికసిత భారత్ కోసం ఆధునిక మౌలిక సౌకర్యాలు అత్యవసరమని మోదీ తెలిపారు. అందుకోసమే మౌలిక రంగానికి 11 లక్షల కోట్లు కేటాయించామన్నారు.

  • 05 Mar 2024 11:24 AM (IST)

    వర్చువల్‌గా ప్రాజెక్టులకు పీఎం మోదీ శంకుస్థాపన..

    సంగారెడ్డి జిల్లా చేరుకున్నారు ప్రధాని మోదీ. 9 వేల 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్‌గా చేశారు. 1409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితమిచ్చారు ప్రధాని మోదీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్ల రూపాయలతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

  • 05 Mar 2024 11:22 AM (IST)

    మహంకాళి అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

    సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. అమ్మవారి చిత్రపటాన్ని ప్రధానికి అందజేశారు ఆలయ అధికారులు. అంతకుముందు అర్చకులు పూర్ణకుంభంతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.

  • 05 Mar 2024 10:31 AM (IST)

    మళ్ళీ ఒకే వేదికపైకి సీఎం రేవంత్, ప్రధాని మోదీ

    మహంకాళి ఆలయంలో పూజల తర్వాత ప్రధాని మోదీ సంగారెడ్డికి వెళుతున్నారు. అయితే వరుసగా రెండోరోజు ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌ ఒకే వేదికపై కనిపిస్తారు. ఇప్పుడిదే అంశం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నేతగా, CMగా రేవంత్.. ప్రధానిని బడేభాయ్ అని పిలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగానూ హాట్‌ టాపిక్ అయ్యింది. తెలంగాణ అవసరాల కోసం కేంద్రంతో సఖ్యత కోరుతున్నామనే మాట CM చెప్తున్నా.. ఈ తరహా పిలుపును BRS అస్త్రంగా వాడుకుంది. BJP- కాంగ్రెస్‌ ఒకటేనని విమర్శలు చేసింది. ఇవాళ్టి పటాన్‌చెరు ఎన్నికల శంఖారావం సభలో మోదీ పొలిటికల్‌గా ఎలాంటి కౌంటర్లు ఇస్తారు.. తెలంగాణకు ఏ హామీలు ఇస్తారు..?

  • 05 Mar 2024 10:15 AM (IST)

    మహంకాళి ఆలయం చేరుకున్న ప్రధాని మోదీ

    రాజ్‌భవన్ నుంచి నేరుగా మహంకాళీ ఆలయానికి చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధానమంత్రి.

  • 05 Mar 2024 10:08 AM (IST)

    మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రధాని మోదీ సంగారెడ్డి పయనం..

    సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రధాని మోదీ.. సంగారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు. 9 వేల 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్‌గా చేయబోతున్నారు. 1409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్ల రూపాయలతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు.

  • 05 Mar 2024 09:23 AM (IST)

    కాసేపట్లో సికింద్రాబాద్‌ మహంకాళి గుడికి ప్రధాని మోదీ..

    తెలంగాణలో రెండోరోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కాసేపట్లో సికింద్రాబాద్‌ మహంకాళి గుడికి వెళ్లి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి సంగారెడ్డిలోని పటేల్‌గూడలో తొమ్మిదివేల కోట్లకు పైగాఅభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

  • 05 Mar 2024 08:00 AM (IST)

    పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం..

    ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మరికొన్ని కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. ఉదయం 10:40కి పటేల్ గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా ప్రారంభిస్తున్నారు. పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీలో దీనికి సంబంధించిన సభ జరగనుంది.

    ఈ వేదికపై 9వేల 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయబోతున్నారు. 1409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్ల రూపాయలతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక మెదక్ జిల్లాలో 399 కోట్లరూపాయలతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

  • 05 Mar 2024 07:30 AM (IST)

    ప్రధాని మోదీ సంగారెడ్డి షెడ్యూల్ ఇదే..

    ఈరోజు ఉదయం 8 గంటల నుంచి తెలంగాణలో మళ్లీ ప్రధాని మోదీ రెండో రోజు షెడ్యూల్‌ ప్రారంభం కాబోతోంది. సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయంలో అమ్మవారికి దర్శించుకోనున్నారు. అక్కడ పూజల అనంతరం నేరుగా సంగారెడ్డి జిల్లాకు వెళ్తారు. ఉదయం పది గంటలకు సంగారడ్డి వెళ్తారు. 10.40కి ఎల్లంపేటలో ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉదయం 11.20కి పటాన్‌చెరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ప్రధాని మోదీ.

  • 05 Mar 2024 07:01 AM (IST)

    ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ..

    సంగారెడ్డిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనల తర్వాత పటాన్‌చెరులో ప్రధాని మోదీ రాజకీయ సభ జరగనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో మూడేంచల భద్రత..2 వేల మందితో పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. సభా స్థలికి వచ్చే వారు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని అధికారులు చెబుతున్నారు. కేవలం మొబైల్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. క్యూ ఆర్ కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటుచేశారు.

  • 05 Mar 2024 07:00 AM (IST)

    తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్న మోదీ..

    తెలంగాణలో ప్రధాని మోదీ రెండోరోజు పర్యటించనున్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లాకు రానున్న ప్రధాని.. వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. అనంతరం పటాన్‌చెరులో పార్టీ ఎన్నికల శంఖారావం సభకు హాజరవుతారు.

Follow us on