ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ లో జెండా ఊపి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో బీఆర్ఎస్, కాంగ్రెస్– బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఇదిలాఉంటే.. ఈ పర్యటనలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతోపాటు పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. 720కోట్ల రూపాయలతో కేంద్రం చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు ప్రధాని నరేంద్రమోడీ.. శంకుస్థాపన చేయనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఆధునిక భవనాల నిర్మాణాలకూ.. పరేడ్‌గ్రౌండ్ నుంచే శంకుస్థాపన చేయనున్నారు. వాటి నమూనాలను కూడా అక్కడే పరిశీలిస్తారు. అంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ –తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభిస్తారు మోదీ. 13 ఎంఎంటీఎస్ రైలు సేవలను వర్చువల్‌గా ప్రారంభించనున్నాకగ. దాదాపుగా 2గంటల పాటు హైదరాబాద్‌లో గడపనున్నారు. శనివారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతోపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించి పలు రూట్లలో వాహనాలను మళ్లించారు.
దేశాన్ని అవినీతి పరుల నుంచి విముక్తం చేయాలా వద్దా అని సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించారు ప్రధాని మోదీ.
కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులపై కొందరు వ్యక్తులు భయాందోళనలు చెందుతున్నారని విపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రధాని మోదీ. వారసత్వ రాజకీయాలు.. అవినీతే వారికి ప్రాధాన్యమని ఎద్దేవా చేశారు ప్రధాని. ఇలాంటి వారికి దేశాభివృద్ధి పట్టదని.. స్వార్థపూరిత ఆలోచనలోనే మునిగి తేలుతుంటారని విమర్శించారు మోదీ. ఇలాంటి వారితో నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రధాని.
తెలంగాణ ఏర్పడినప్పుడే కేంద్రంలో NDA ప్రభుత్వం కూడా వచ్చిందన్నారు ప్రధాని మోదీ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతను కేంద్రం తీసుకుందాన్నారు ప్రధాని.
తెలంగాణలో కేంద్రం చేపడుతున్న అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు ప్రధాని మోదీ. దీనివల్ల ప్రాజెక్టుల పనులు ఆలస్యం అవుతున్నాయని.. దీనివల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని మోదీ చెప్పారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించొద్దని ఆయన అన్నారు.
దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నామన్నారు. అందులో లక్షలాది మంది తెలంగాణ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. గడిచిన 9 ఏళ్లలో 9 కోట్ల మంది మహిళలకు ఉజ్వల గ్యాస్ కనేక్షన్ లభించిందన్నారు. 5 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ కు లోన్స్ లభిస్తున్నాయన్నారు.
ప్రధానీ మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే మహబూబ్ నగర్-సికింద్రాబాద్ డబ్లింగ్ లైన్ ను జాతికి అంకితం చేశారు.
పెరేడ్ గ్రౌండ్ లో వీఐపీ గేట్ వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది , కార్యకర్తలు ఒకే సారి లోపలికి వెళ్ళడం తో ఈ ఘటన చోటుచేసుకుంది
ప్రధాని మోదీ సికింద్రాబాద్ కు చేరుకున్నారు. అనంతరం జెండా ఊపి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలను జెండా ఊపి ప్రారంభించారు.
ప్రధాని మెదీ బైగంపేట విమానశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరుపున నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు స్వాగతం పలికారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు మోదీ పర్యటనపై సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు.
మరికాసేపట్లో ప్రధాని మోదీ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అయితే అంతకు ఆయన ట్విట్టర్ లో పలు వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించడం లేదా వాటి శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. https://t.co/3UPLRXhk5k
— Narendra Modi (@narendramodi) April 8, 2023
ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ లో స్పందించారు. తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురూచూస్తూ ప్రధానికి స్వాగతం పలుకుతోందని తెలిపారు. తొమ్మిదేళ్లైనా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధకరమన్నారు. బడ్జెట్ లోనూ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు ఇవ్వలేదని.. ఈ సభలోనైనా తెలంగాణకు నిధులు ప్రకటించాలని కోరుతున్నామని తెలిపారు.
ప్రధాని శ్రీ @narendramodi గారికి తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ స్వాగతం పలుకుతోంది. తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. బడ్జెట్ లోనూ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఈ సభలోనైనా తెలంగాణకు నిధులు ప్రకటించాలని కోరుతున్నాం.
1/3— YS Sharmila (@realyssharmila) April 8, 2023
– సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ రైలు ప్రారంభోత్సవం
— మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ
— అక్కడే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
— సీఎం కేసీఆర్‌ను హాజరుకావాలంటూ ఇప్పటికే PMO ఇన్విటేషన్
— మోదీతో వేదిక పంచుకునేందుకు ససేమిరా అంటున్న కేసీఆర్
— ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్లబోతున్న మంత్రి తలసాని
సింగరేణి ప్రైవేటీకరణను నిరసిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా కోల్‌బెల్ట్ ఏరియాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు , ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, రామగుండం, భూపాలపల్లి, ఖమ్మంజిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉన్న సీఎం కేసీఆర్‌కు ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది బీజేపీ. ఇందులో భాగంగా ఆయనను రాజకీయంగా ఇరకాటంలో పెట్టే ఉద్దేశ్యంతో పరేడ్ గ్రౌండ్స్ సభా వేదికపై కేసీఆర్ కోసం ఆసనం ఏర్పాటు చేస్తోంది. కే. చంద్రశేఖరరావు, చీఫ్ మినిస్టర్ అంటూ రిజర్వ్డ్ సీట్ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ సీటుకు ఎడమవైపున కేసీఆర్ సీటు ఏర్పాటు చేశారు.
ప్రధాని మోదీ కాసేపట్లో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కి రానున్నారు. ముందుగా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు, 13 ఎంఎంటీఎస్ సేవల ప్రారంభం. అనంతరం బీబీనగర్ ఎయిమ్స్ ఆధునిక భవనాలకు శంకుస్థాపన.. పరేడ్‌గ్రౌండ్‌లో లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బేగంపేట-సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్ గ్రౌండ్స్‌ను ఆధీనంలోకి తీసుకున్న ఎస్పీజీ..
ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ టూర్ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో BRS-BJP పొలిటికల్ వార్ నడుస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న మోదీ..పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు? అభివృద్ధి ముచ్చట్లకే పరిమితమవుతారా? రాజకీయ విమర్శలు ఎక్కుపెడతారా? ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.