Hyderabad: ఆస్తి పన్ను చెల్లించే వారికి జీహెచ్‌ఎంసీ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ఆస్తిపన్నును సకాలంలో చెల్లించని పక్షంలో ప్రతి నెల 2 శాతం పెనాల్టీతో చెల్లించాల్సి ఉంటుంది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు పన్ను చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. మొదటి ఆరు నెలలకోసారి, రెండవ అరు నెలల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొదటి ఆరు నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ జూలై ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మొదటి మూడు నెలలైన ఏప్రిల్, మే, జూన్ నెలకు ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఆ తర్వాత వచ్చే మూడు నెలలకు అంటే జూలై, ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో ఒక్కొక్క నెలకు 2 శాతం చొప్పున పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా మిగతా ఆరు నెలల అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలకు ఎలాంటి పెనాల్టీ ఉండదు. మిగతా మూడు మాసాలైన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు 2 శాతం చొప్పున పెనాల్టీ విధిస్తారు. ఒక వేళ సంవత్సరం పాటు ఆస్తిపన్ను చెల్లించనివారు 24 శాతం పెనాల్టీతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 17 లక్షల 34 వేల 411 కమర్షియల్, రెసిడెన్షియల్, మిక్సిడ్ గల భవనాల కలిగిన పన్ను చెల్లింపుదారులున్నారు. అందులో 9 లక్షల 6 వేల 486 ప్రాపర్టీలకు ఇప్పటి వరకు సుమారు 887కోట్ల అస్తి పన్ను చెల్లించారు. మిగిలిన వారు కూడా వెంటనే చెల్లించి 2 శాతం పెనాల్టీ నుండి మినహాయింపు పొందండి.. జిహెచ్ఎంసీ పరిధిలో గల కమర్షియల్ రోడ్లకు ఇరువైపులా ఉన్న భవనాలను సర్వే చేసేందుకు 340 సర్వే టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. సర్వే టీమ్ వారు ఇంటింటికి వెళ్లి మిక్సింగ్, కమర్షియల్ అనుమతి లేకుండాపై అంతస్తు భవానాలు ఉన్న పక్షంలో మార్చుకునేందుకు స్వయంగా దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించారు. తద్వారా 49, 439 మంది స్వయంగా ట్యాక్స్ మదింపుకు కోసం విన్నవించుకున్నారు. అలా వచ్చిన దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. ఇంకా మదింపు కానీ, తక్కువ అసెస్మెంట్ ఉన్న నిర్మాణాలను పరిశీలించి వాటికి నిబంధనల ప్రకారంగా ట్యాక్స్ రివిజన్ చేసే పక్రీయా కొనసాగుతోందని తెలిపారు.
ఇవి కూడా చదవండి: