Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా..?

|

Sep 11, 2024 | 3:27 PM

వరదల సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఉదారతను చాటుకున్నారు.. ఏపీకి, తెలంగాణకు చెరొక కోటి రూపాయల చొప్పున ప్రకటించారు. అంతేకాకుండా.. ఏపీలో వరదలో చిక్కుకున్న 400 పంచాయతీలకు... 4కోట్ల విరాళం ప్రకటించారు. ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క లక్ష చొప్పున అందజేశారు.

Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా..?
Pawan Kalyan Revanth Reddy
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ సీఎంతో సమావేశమయ్యారు. తెలంగాణ వరద బాధితుల కోసం పవన్ కోటి రూపాయల చెక్‌ను రేవంత్‌కు అందించారు. తెలంగాణ సీఎం ప్రత్యేక నిధికి ఈ విరాళాన్ని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ బుధవారం సీఎంను కలిసి చెన్ ను అందజేశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య మధ్య మాటామంతీ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

కాగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇటు తెలంగాణ.. అటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల్లోనూ వరద బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా మహబూబాబాద్ తోపాటు ఖమ్మం.. విజయవాడ నగరాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఖమ్మంలో మున్నేరు, విజయవాడలో బుడమేరు బీభత్సం సృష్టించాయి.. విజయవాడలో కొన్ని కాలనీలు నీటమునిగాయి.. లక్షలాది మంది ప్రభావితమయ్యారు.. చాలా మందిని రెస్క్యూ చేసి కాపాడారు. భారీ వర్షాలు, వరదలకు తెలంగాణలో 33 మంది మరణించగా.. ఆంధ్రప్రదేశ్ లో 46 మంది మృతి చెందినట్లు ప్రభుత్వాలు వెల్లడించాయి..

కాగా.. వరదల సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఉదారతను చాటుకున్నారు.. ఏపీకి, తెలంగాణకు చెరొక కోటి రూపాయల చొప్పున ప్రకటించారు. అంతేకాకుండా.. ఏపీలో వరదలో చిక్కుకున్న 400 పంచాయతీలకు… 4కోట్ల విరాళం ప్రకటించారు. ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క లక్ష చొప్పున అందజేశారు. ఇలా మొత్తంగా రూ.6 కోట్లను వరద బాధితుల కోసం ప్రకటించారు. ఇటీవల చంద్రబాబును కలిసి ఈ విరాళాన్ని అందజేశారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.