
హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు సమాచారం అందడం కలకలం రేపింది. ఉగ్ర కుట్రలకు హైదరాబాద్ లోని చంచల్‌గూడ జైల్లో ప్రణాళికలు రచించినట్లు నిఘావర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. జైలు ములాఖత్‌లో ఉగ్రకుట్ర జరిగిందన్న నిఘావర్గాలు.. లష్కరే తోయిబా ఉగ్రవాది జైల్లో కుట్ర చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ములాఖత్‌లో ఉగ్రదాడులపై చర్చించినట్టు సమాచారం.. వరుస పేలుళ్ల కుట్రకేసులో ఇప్పటికే చంచల్‌గూడ జైల్లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒక ఉగ్రవాది భార్య ద్వారా.. ఉగ్రకుట్రపై సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి.. ఈ పరిణామాలతో ముసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్‌లో పోలీసుల నిఘా ఉంచారు. అంతేకాకుండా.. పోలీసు యంత్రాంగం హైదరాబాద్ నగరం వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఉగ్ర లింకులపై పూర్తి సమచారం పసిగట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
అయితే.. గత ఏడాది నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుళ్లు రిపీట్ అవుతాయా? ఉగ్రవాదులు మళ్లీ స్కెచ్ గీస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్పడం కలకలం రేపింది.. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలో మళ్లీ హైఅలర్ట్ ప్రకటించారు.. ఉగ్రదాడి జరగొచ్చన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భద్రతను ఒక్కసారిగా పెంచారు. ఎర్రకోట దగ్గర లష్కరే తోయబా పేలుడుకు పాల్పడవచ్చని అలర్ట్ చేసింది ఇంటెలిజెన్స్.. ఎర్రకోటతోపాటు చాందినీచౌక్‌లోని ఓ ఆలయం దగ్గర IED పేలుళ్లకు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల దగ్గర కూడా పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈనెల 6న ఇస్లామాబాద్‌లో జరిగిన పేలుళ్లకు ప్రతీకారంగా ఢిల్లీకి ఉగ్రదాడికి ప్లాన్ చేశారని అలర్ట్‌చేసింది. ఇంటెలిజెన్స్ వార్నింగ్‌లతో అప్రమత్తమైన భద్రతావర్గాలు.. ఢిల్లీలోని VVIP ప్రాంతాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టంచేశారు
కాగా, గతేడాది నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడులో 15మంది మరణించగా.. 20మంది గాయపడిన విషయం తెలిసిందే.. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.. ఈ క్రమంలోనే.. మళ్లీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పేర్కొంటుండటం కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..