
సాధారణంగా ఆరోగ్య శ్రీ కార్డు పొందాలంటే కొన్ని గుర్తింపు కార్డులు కావాల్సి ఉంటుంది. అయితే ఇవి ఆనాథ పిల్లల వద్ద లేకపోవడంతో వారు ఆరోగ్య శ్రీ కార్డును పొందలేపోయారు. దీని వల్ల వారు ఆనారోగ్యం బారీన పడినప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం లేకుండానే అనాథ పిల్లల పేరుమీదే ఆరోగ్య శ్రీ కార్డులను అందించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకే హైదరాబాద్‌లోని 2,215 మంది అనాథ పిల్లలకు శనివారం మంత్రి దామోదర రాజనర్షింహా ఆరోగ్య శ్రీకార్డును అందజేశారు. దీంతో ఇకపై హైదరాబాద్‌లోని శిశువిహార్, ప్రభుత్వ సంరక్షణ వసతి గృహాల్లో ఉంటున్న చిన్నారులు ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో 1,835 కి పైగా క్లిష్టమైన వైద్య విధానాలకు ₹10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని పొందవచ్చు.
ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ..హైదరాబాద్‌లోని CCIలలో ఉన్న 2,215 మంది పిల్లలలో 641 మంది అనాథలు, 1,103 మంది సెమీ-అనాథలు, 471 మంది దారిద్య్రరేఖకు దిగువన (BPL) కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు ఉన్నారని తెలిపారు. ఇక్కడ నివసించే పిల్లలు ఆనారోగ్యానికి గురైనప్పుడు వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తన్నా.. ప్రైవేటు, కార్పొరేటు హాస్పిటల్స్‌లో వైద్యం అందిస్తే వేగంగా కోలుకుంటారని అందుకే ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేసినట్టు తెలిపారు. ఈ నిర్ణయం సమ్మిళిత, అంతర్-విభాగ పాలన శక్తికి నిదర్శనమని, అనాథ పిల్లల భద్రతను బలోపేతం చేసినట్టు అవుతుందని కూడా అయన తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..