Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ ఫైరింగ్.. ఒకరి మృతి

|

Apr 05, 2023 | 5:59 AM

హైదరాబాద్‌ నగరంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టప్పాచబుత్రాలో ఆకాశ్‌ సింగ్‌(26) అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు పాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆకాశ్‌సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న డీసీపీ కిరణ్‌, పోలీసులు

Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ ఫైరింగ్.. ఒకరి మృతి
Gun Firing
Follow us on

హైదరాబాద్ లో పాతకక్షలు భగ్గుమన్నాయి. టపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్వాన్ మురిగి చౌక్ దగ్గర బీజేపీ నేత అమర్‌సింగ్ అల్లుడు ఆకాష్ సింగ్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పలు జరిపారు. పాయింట్ బ్లాంక్ లో గన్ తో కాల్చి చంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో గన్ తో పాటు కత్తులు కూడా దొరికినట్లు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ చెప్పారు. కాల్పులు జరిపిన వెంటనే క్రాంతి, అతని అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే టప్పాచబుత్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కాల్పులు జరిపిన వెంటనే క్రాంతి, అతని అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు.  కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..