Khairatabad Ganesh 2024: 70 ఏళ్లు.. 70 అడుగులు.. ఖైరతాబాద్‌ గణేషుడి మరో చరిత్ర..

|

Aug 03, 2024 | 9:44 AM

గతేడాది రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు.. ఈసారి కూడా తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సప్తముఖ గణేశుడి రూపంలో ఈసారి కొలువుదీరబోతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 70 అడుగుల ఎత్తులో గణనాథుడు ముస్తాబవుతున్నాడు. ఈసారి కొలువుదీరే గణేశుని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Khairatabad Ganesh 2024: 70 ఏళ్లు.. 70 అడుగులు.. ఖైరతాబాద్‌ గణేషుడి మరో చరిత్ర..
Khairatabad Ganesh Idol (File)
Follow us on

హైదరాబాద్‌లో ది ఫేమస్ ఖైరతాబాద్​ వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడి లంబోదరుడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఖైరతాబాద్ గణేషుడు రికార్డ్‌లకు కేరాఫ్‌గా మారాడు. ఈసారి కూడా హైట్‌లో తన పేరు మీదున్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 70 అడుగుల ఎత్తులో… ఈ ఏడాది సప్తముఖ గణేశుడి రూపంలో దర్శనమివ్వబోతున్నాడు. పూర్తిగా మట్టితో మహాగణపతి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖైరతాబాద్‌ గణేశుడికి ఇరువైపులా.. శివపార్వతులు, శ్రీనివాసుల కల్యాణ మండపం.. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం ఉంటాయి.

ఖైరతాబాద్ గణేషుడికి సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు స్థానిక ఆలయంలో ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి సామూహిక పూజలు చేశారు. అలా.. 2014 వరకు ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని తయారు చేశారు. 2019లో 61 అడుగుల ఎత్తున్న గణపతిని తయారు చేయగా.. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది. అప్పటినుంచి విగ్రహం ఎత్తు మళ్లీ క్రమంగా తగ్గించడం మొదలు పెట్టారు. దాంతోపాటు.. ప్లాస్టర్‌ ఆఫ్‌ ఫారిస్‌ విగ్రహానికి గుడ్‌ బై చెప్పి.. మట్టి గణపయ్యకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే.. గతేడాది (2023) పూర్తి మట్టితో 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డ్‌ నెలకొల్పారు. గత సంవత్సరం కంటే 7 అడుగులు ఎక్కువ ఎత్తుతో కమిటీ నిర్వహకులు మొత్తం 70 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..