
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సన ఆత్మహత్య వ్యవహారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ లైవ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ షాక్‌కి గురి చేసింది. భర్త హేమంత్ వేధింపులు తాళలేక చనిపోతున్నట్లు ఆమె ప్రకటించింది. అయితే కేసు విచారణ చేపట్టిన పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. డీజే మోడల్ సుఫియా ఖాన్‌తో సన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తేలింది. సుఫియాఖాన్ కోసం సనను హేమంత్ వేధించినట్లు పోలీసుల విచరాణ వెల్లడైంది.
వివాహేతర సంబంధం కారణంగానే సనాని సుదీర్ఘ కాలంగా వేధిస్తూ వస్తున్నాడు హేమంత్. హేమంత్ ఆబిడ్స్‌లో డీజేగా పనిస్తున్నాడు. సన.. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెకీగా పనిచేస్తోంది. రాజస్థాన్‌లో ఇద్దరూ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. 5నెలలుగా ఇద్దరి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యే సన హైదరాబాద్‌లోని నాచారం వచ్చేసింది. అయినా భర్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో పెట్టి మరీ తాను సూసైడ్ చేసుకుంది.
డీజే మోడల్ సుఫియా ఖాన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని సనాని వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు సనా తల్లిదండ్రులు. పీఎస్‌లో కంప్లైంట్ చేసినా ఫలితం లేదనీ… హేమంత్ వేధింపులు ఆపలేదనీ అంటున్నారు. బాగా చూసుకుంటానని…బాండ్ పేపర్ మీద రాసిచ్చి తీసుకొచ్చి… ప్రీప్లాన్డ్‌గా ఆత్మహత్యచేసుకునేలా చేశాడని ఆరోపిస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..