Nandamuri Balakrishna: బసవతారకంలో.. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందించటమే లక్ష్యం: బాలకృష్ణ

Basavatarakam Indo American Cancer Hospital: అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందించటమే లక్ష్యమని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రి చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే

Nandamuri Balakrishna: బసవతారకంలో.. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందించటమే లక్ష్యం: బాలకృష్ణ
Nandamuri Balakrishna

Updated on: Sep 18, 2021 | 5:35 AM

Basavatarakam Indo American Cancer Hospital: అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందించటమే లక్ష్యమని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రి చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. అత్యాధునిక పరికరాలతో తమ ఆసుపత్రిలో క్యాన్సర్​రోగులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ రేడియోగ్రఫీ యంత్రాన్ని ఆ హాస్పిటల్ చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తక్కువ ధరలో అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్యం అందించడమే బసవతారకం ఆస్పత్రి లక్ష్యమని తెలిపారు.

పెరుగుతున్న రోగులను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు వైద్యసేవలను ఆధునీకరించుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రోగులకు వైద్యం అందించాలన్న తమ తల్లిదండ్రుల లక్ష్యాన్ని నెరవేర్చటమే బాధ్యతని వెల్లడించారు. ఆధునికతతోపాటు పేద ప్రజలకు అందుబాటు ఖర్చులోనే వైద్యం అందిస్తూ ముందుకు సాగుతున్నామని బాలకృష్ణ తెలిపారు. ఆస్పత్రి గడప తొక్కిన ప్రతీ రోగికి.. దేవాలయంలో అడుగుపెట్టిన భావన కలుగుతోందంటే.. దాని వెనక ఎంతో మంది కృషి దాగుందని బాలకృష్ణ పేర్కొన్నారు.

Basavatarakam Hospital

డిజిటల్ రేడియోగ్రఫీ యంత్రాన్ని.. రూ. 50 లక్షలతో ప్రారంభించారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన యంత్రంతో 8 గంటల్లో దాదాపు 200లకు పైగా ఎక్స్​రేలు తీయోచ్చని వైద్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బాలయ్యతో పాటు ఆస్పత్రి సీఈఓ డాక్టర్ ప్రభాకర్ రావు, మెడికల్ డైరెక్టర్ టీఎస్ రావు, రేడియాలజీ విభాగం హెడ్ డాక్టర్ వీరయ్య చౌదరి సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు.

Also Read:

Jaggery Benefits: బెల్లంతో బోలెడన్ని ప్రయోజనాలు.. ఈ 5 వ్యాధులకు చక్కటి పరిష్కారం.!

Memory Power: కళ్లకూ.. జ్ఞాపకశక్తికీ చాలా దగ్గర సంబంధం ఉంది.. ఎలానో తెలుసా?