Hyderabad Numaish: నుమాయిష్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎగ్జిబిషన్‌ టైమింగ్స్ ఇవే..

|

Jan 01, 2024 | 6:27 PM

Hyderabad Numaish 2024: హైదరాబాద్‌ నాంపల్లిలో నుమాయిష్‌ సందడి మొదలైంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 83వ నుమాయిష్‌ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు.. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Hyderabad Numaish: నుమాయిష్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎగ్జిబిషన్‌ టైమింగ్స్ ఇవే..
Hyderabad Numaish
Follow us on

Hyderabad Numaish 2024: హైదరాబాద్‌ నాంపల్లిలో నుమాయిష్‌ సందడి మొదలైంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 83వ నుమాయిష్‌ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు.. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ కొనసాగనుంది. రేపటి నుంచి ప్రజలను ఎగ్జిబిషన్‌కు అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి పదిన్నర వరకు.. వీకెండ్స్‌లో రాత్రి 11 వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్‌కి ఎంట్రీ ఫీజు 40 రూపాయిలుగా నిర్ణయించారు. ఈ ఏడాది ఎగ్జిబిషన్ లో దేశ నలుమూలల నుంచి 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు.

నాంపల్లి ఎగ్జిబిషన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఇవ్వాల్టి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నాంపల్లి పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్వీట్..

నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడపనుంది. ఇంకా మెట్రో సమయాన్ని కూడా పెంచే అవకాశం ఉంది.. నాంపల్లి, గాంధీభవన్ మెట్రో ష్టేషన్లు ఎగ్జిబిషన్ మైదానానికి సమీపంగా ఉండటంతో మెట్రో రైళ్లను అర్థరాత్రి వరకు పొడిగించే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..