Hyderabad: ‘బిడ్డను బతికించుకోలేని ఈ బతుకు ఎందుకని’.. పాపం ఆ తల్లి అలసిసొలసి…

ఈ ఘటన గురించి చదివితే మీకు కన్నీళ్లు వస్తాయి. తన బిడ్డ జబ్బును నయం చేసేందుకు ఆ తల్లి మానవ ప్రయత్నాలు అన్నీ చేసింది. కానీ నయం కాలేదు. దీంతో అలసిసొలసి సొమ్మసిల్లింది. చివరకు...

Hyderabad: బిడ్డను బతికించుకోలేని ఈ బతుకు ఎందుకని..  పాపం ఆ తల్లి అలసిసొలసి...
Mother Dies

Updated on: Jul 09, 2022 | 11:50 AM

Telangana: హైదరాబాద్ మహనగరంలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న తన పాపకు చికిత్స చేయించలేక.. తీవ్ర మనస్తాపంతో ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాజేంద్రనగర్(Rajendra Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్‌(Attapur)లో జరిగింది. జహీరాబాద్ కు చెందిన పూజా – అరవింద్ దంపతులు పాండురంగనగర్‌లో గత రెండేళ్లుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది క్రితం పాప పుట్టింది. పుట్టిన నెల రోజులకే చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలింది. అప్పటినుంచి పలు ఆసుపత్రుల్లో చికిత్స కోసం 4 – 5 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇప్పటికే అప్పుల పాలైనా.. పాప వ్యాధి మాత్రం యధావిధిగా ఉండడంతో, భవిష్యత్తులో తన పాప పరిస్థితి ఏమవుతుందని భయంతో దంపతులిద్దరూ కుమిలిపోయారు. చివరికి అద్దె డబ్బులు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని మనస్తాపంతో తల్లి పూజా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..