AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ మార్గంలో మూసి వరద కష్టాలకు చెక్.. ఇక ప్రయాణం సులభం..

హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్. మూసారాంబాగ్‌ వంతెన పూర్తిగా అందుబాటులోకి రానుంది. రూ.52 కోట్లతో 400 మీటర్ల పొడవున నిర్మించిన ఈ బ్రిడ్జిని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో అంబర్‌పేట్‌–మూసారాంబాగ్‌ మధ్య రాకపోకలు సులభం కానున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మూసీ వరదల కారణంగా ఏర్పడే ట్రాఫిక్‌ ఇబ్బందులకు పరిష్కారం లభించనుంది.

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ మార్గంలో మూసి వరద కష్టాలకు చెక్.. ఇక ప్రయాణం సులభం..
Hyderabad Moosarambagh Bridge
Shaik Madar Saheb
|

Updated on: Aug 31, 2026 | 8:25 AM

Share

హైదరాబాద్‌ ముసారంబాగ్‌లో ఇక వరద కష్టాలకు ఇక చెక్ పడనుంది.. మూసారంబాగ్ బ్రిడ్జి ఇవ్వా్ల్టి నుంచి పూర్తిగా అందుబాటులోకి రానుంది.. సోమవారం మూసారంబాగ్ వంతెనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 52 కోట్ల రూపాయలతో 400 మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మించారు. వంతెన వెడల్పు 14.5 మీటర్లు కాగా, పాదచారుల కోసం 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో అంబర్‌పేట్‌–మూసారాంబాగ్‌ మధ్య ఏడాది పొడవునా రాకపోకలకు వీలు కలగనుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఏర్పడే నీటి ముంపు, రాకపోకల అంతరాయానికి శాశ్వత పరిష్కారం లభించనుంది. దీంతో రెండు ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడి, ప్రజలకు సురక్షితమైన, నిరంతరాయమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వాస్తవానికి ఈ బ్రిడ్జి చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. మూసారాంబాగ్‌ దగ్గర మూసీ నదిపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం 2022లో పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. అనంతరం పనులు పూర్తి కాగా.. ఎట్టకేలకు ఇవాళ ప్రారంభానికి సిద్ధమైంది.

ఈ బ్రిడ్జ్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తనిఖీ చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్ల గురించి అధికారులతో ఆరా తీశారు. చంచల్ గూడ ఫ్లైఓవర్ దగ్గర, ప్రధాన ఫ్లైఓవర్ పూర్తయింది, దీని ప్రారంభోత్సవానికి మార్గం సుగమం చేయాలని అధికారులకు సూచించారు కమిషనర్. చంపాపేట్ వైపు వెళ్లే ఏ3 సైడ్ ర్యాంప్‌ను రెండు మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ ప్రాంతాలకు ప్రయాణం సులభం

ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిన వస్తే చంచల్‌గూడ, సైదాబాద్, సంతోష్ నగర్, ఐఎస్ సదన్, ఒవైసీ హాస్పిటల్, కంచన్ బాగ్, చంపాపేట్, సాగర్ రోడ్ వైపు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ప్రయాణం సులభం అవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాన్ కార్డు సిగ్నేచర్ ఆన్‌లైన్ ద్వారా మార్చుకోవడం ఎలా..?
పాన్ కార్డు సిగ్నేచర్ ఆన్‌లైన్ ద్వారా మార్చుకోవడం ఎలా..?
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు..
10ఏళ్ల ప్రేమ.. ప్రియుడి నమ్మకద్రోహం.. చివరకు యువతి ఊహించని..
10ఏళ్ల ప్రేమ.. ప్రియుడి నమ్మకద్రోహం.. చివరకు యువతి ఊహించని..
తెలంగాణ రైతులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్..
తెలంగాణ రైతులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్..
ఆలూ-రవ్వ స్నాక్.. ఒక్కసారి రుచి చూస్తే ఇడ్లీ.. దోస.. మర్చిపోతారు!
ఆలూ-రవ్వ స్నాక్.. ఒక్కసారి రుచి చూస్తే ఇడ్లీ.. దోస.. మర్చిపోతారు!
బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ ఛాన్స్ వస్తే మాత్రం వెళ్ళాను..
బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ ఛాన్స్ వస్తే మాత్రం వెళ్ళాను..
దోస.. ఇడ్లీ.. బోర్ కొడితే అప్పటికప్పుడు ఈ ఉల్లి బోండా ట్రై చేయండి
దోస.. ఇడ్లీ.. బోర్ కొడితే అప్పటికప్పుడు ఈ ఉల్లి బోండా ట్రై చేయండి
దోశను ఇంగ్లీషులో ఏమంటారు..? 99శాతం మందికి తెలియని అసలు నిజం..
దోశను ఇంగ్లీషులో ఏమంటారు..? 99శాతం మందికి తెలియని అసలు నిజం..
వర్షాకాలంలో కోడి కూరను ఇలా తింటే జలుబు, దగ్గు పారిపోతాయ్..
వర్షాకాలంలో కోడి కూరను ఇలా తింటే జలుబు, దగ్గు పారిపోతాయ్..
లిఫ్ట్‌కు - గోడ‌కు మ‌ధ్య వేలాడుతుండ‌గా హైడ్రా ఆప‌రేష‌న్‌
లిఫ్ట్‌కు - గోడ‌కు మ‌ధ్య వేలాడుతుండ‌గా హైడ్రా ఆప‌రేష‌న్‌