Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ మార్గాల్లో ఎంఎంటీఎస్ సేవలు రద్దు

|

May 21, 2022 | 11:48 AM

హైదరాబాద్‌(Hyderabad), సికింద్రాబాద్‌ నగర పరిధిలోని పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. లింగంపల్లి–హైదరాబాద్, హైదరాబాద్‌–లింగంపల్లి, ఫలక్‌‌నుమా–లింగంపల్లి,...

Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ మార్గాల్లో ఎంఎంటీఎస్ సేవలు రద్దు
Mmts
Follow us on

హైదరాబాద్‌(Hyderabad), సికింద్రాబాద్‌ నగర పరిధిలోని పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. లింగంపల్లి–హైదరాబాద్, హైదరాబాద్‌–లింగంపల్లి, ఫలక్‌‌నుమా–లింగంపల్లి, లింగంపల్లి–ఫలక్‌‌నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి(Lingam Palli), లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గాల్లో తిరిగే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు. కరోనా పేరుతో దాదాపు ఏడాది పాటు ఎంఎంటీఎస్‌(MMTS) లను నడపని దక్షిణమధ్య రైల్వే తర్వాత అరకొరగా సర్వీసులను ప్రారంభించింది. పూర్తి స్థాయి సర్వీసులను పెంచకుండా కేవలం 76తో సరిపెడుతూ వస్తోంది. వాటిలో దాదాపు సగానికి శని, ఆదివారాల్లో కత్తెరేసింది. గత వారాంతం మాదిరే ఈ వారాంతమూ 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులను తగ్గించేసింది. ఏ సమయంలో నడిచే రైలును రద్దు చేశారో తెలియని గందరగోళాన్ని దక్షిణమధ్యరైల్వే ప్రతి వారాంతాల్లో సృష్టిస్తోంది.

లింగంపల్లి – హైదరాబాద్‌ మధ్య 18 సర్వీసులు, ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య 14 సర్వీసులు, సికింద్రాబాద్‌ – లింగంపల్లి మధ్య రెండు సర్వీసులను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయించారు. అత్యంత చవకగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైగ్యులర్ గా సర్వీసులను నడపాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Aishwarya Rai Bachchan: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‏లో ఐశ్వర్య రాయ్ స్టైలీష్ లుక్.. యువరాణిల తళుక్కుమన్న అందాల తార..

PM Modi: బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది.. ఎనిమిదేళ్ల పాలన సందర్భంగా ప్రధాని కామెంట్