నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: తలసాని

ఇప్పటికే హైదరాబాద్‌లో గణేషుల నిమజ్జనం జోరందుకుంంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హుస్సేన్‌ సాగర్‌లో వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని శాఖలను సమన్వయపరుస్తూ ముందుకెళుతున్నామని మంత్రి తలసాని చెప్పారు. పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఖైరతాబాద్‌ వినాయకుడిని తొందరగా నిమజ్జనం చేయాలని ఒత్తిడి చేయబోమన్నారు. హుస్సేన్‌ సాగర్‌లో 20 ఫీట్ల లోతు వరకూ తవ్వకాలు జరిపామని తలసాని వెల్లడించారు. అలాగే.. ఆరోజు గణేష్ నిమజ్జనాకి వేలల్లో […]

నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: తలసాని

Edited By:

Updated on: Sep 06, 2019 | 9:16 PM

ఇప్పటికే హైదరాబాద్‌లో గణేషుల నిమజ్జనం జోరందుకుంంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హుస్సేన్‌ సాగర్‌లో వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని శాఖలను సమన్వయపరుస్తూ ముందుకెళుతున్నామని మంత్రి తలసాని చెప్పారు. పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఖైరతాబాద్‌ వినాయకుడిని తొందరగా నిమజ్జనం చేయాలని ఒత్తిడి చేయబోమన్నారు. హుస్సేన్‌ సాగర్‌లో 20 ఫీట్ల లోతు వరకూ తవ్వకాలు జరిపామని తలసాని వెల్లడించారు. అలాగే.. ఆరోజు గణేష్ నిమజ్జనాకి వేలల్లో జనం తరలివస్తారని.. ఇందుకు పోలీస్ శాఖకు తగిన సూచనలు చేసినట్టు చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్.