
హైదరాబాద్‌లో నూతన సంవత్సరం రోజు మరో నూతన ఫ్లైఓవర్‌ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. రూ. 263 కోట్ల వ్యయంతో 2.216 కిలోమీటర్ల పొడవైన కొత్తగూడ ఫ్లైఓవర్ ని మంత్రి ప్రారంభించారు. బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్, కొండాపూర్ జంక్షన్ లను కవర్ చేసేలా ఈ కొత్తగూడ ఫ్లైఓవర్‌ని నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌తో కొండాపూర్ జంక్షన్ లో 60 శాతం ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలకు కల్పతరువులాంటి నగరం హైదరాబాద్ లో… దేశంలో మరే నగరంలో జరగనంత అభివృద్ధి జరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ విజన్‌కి అనుగుణంగా ఈ పనులు జరుగుతున్నాయన్నారు.
2023 లో మరో 11 ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. ఈ యేడాది వరదలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మక నాళా డెవలప్‌మెంట్ ప్రోగ్రాంకి శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు మంత్రి.
కాగా బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లకు ఇరువైపులా భారీ కమర్షియల్ భవనాలు ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో అనేక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలు, కంపెనీలు ఉన్నాయి. ఈ జంక్షన్లలో రద్దీ సమయాల్లో భారీ ట్రాఫిక్ జాం అవుతోంది. ముఖ్యంగా గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్‌సిటీ ప్రాంతం మధ్య ప్రధాన కనెక్టివిటీ రహదారి ఏర్పడుతుంది.
ఈ ఫ్లై ఓవర్ రాకతో బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్లలో వంద శాతం ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కొండాపూర్ జంక్షన్‌లో 65 శాతం మేర ట్రాఫిక్‌కు విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఐటీ కంపెనీల ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. నూతన సంవత్సర కానుకగా ఆదివారం ఉదయం కొత్తగూడ ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
మరిన్ని హైదరాబాద్ న్యూస్ కోసం