Harinatha Rao: కేటీఆర్ దంపతులను ఓదార్చిన సీఎం కేసీఆర్.. వియ్యంకుడు హరినాథరావుకు నివాళులు..

|

Dec 29, 2022 | 5:30 PM

సీఎం కేసీఆర్‌ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్‌ మామ పాకాల హరినాథరావు కన్నుమూశారు. అనారోగ్యంతో ఈ నెల 27న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన హరినాథరావు.. చికిత్స పొందుతూ మృతి చెందారు.

Harinatha Rao: కేటీఆర్ దంపతులను ఓదార్చిన సీఎం కేసీఆర్.. వియ్యంకుడు హరినాథరావుకు నివాళులు..
Harinatharao Passed Away
Follow us on

సీఎం కేసీఆర్‌ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్‌ మామ పాకాల హరినాథరావు కన్నుమూశారు. అనారోగ్యంతో ఈ నెల 27న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన హరినాథరావు.. చికిత్స పొందుతూ మృతి చెందారు. పరిస్థితి విషమించడంతో పాకాల హరినాథరావు (72) గురువారం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా, హరినాథరావుకు మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.

హరినాథరావు మృతి గురించి సమాచారం అందుకున్న మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం హరినాథరావు పార్థివదేహాన్ని రాయదుర్గంలోని ఆయన నివాసానికి తరలించారు.

ఇవి కూడా చదవండి

Cm Kcr

హరినాథరావు భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ దంపతులు నివాళులర్పించి కోడలు శైలిమను ఓదార్చారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి మహమూద్ అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మీ, పలువురు నాయకులు సైతం హరినాథరావు భౌతికకాయానికి నివాళులర్పించారు.

హరినాథరావు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. కాగా, పాకాల హరినాథరావు మృతితో కల్వకుంట్ల కుటుంబంలో విషాదం అలుముకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..