Hyderabad Drug Bust: హైదరాబాద్‌లో డ్రగ్స్ డెన్.. 12వేల కోట్ల మాదక ద్రవ్యాలు స్వాధీనం.. మహారాష్ట్రలో తీగ లాగితే..

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టురట్టయ్యింది. మేడ్చల్ జిల్లాలో శనివారం మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. మహారాష్ట్రలో తీగ లాగితే.. హైదరాబాద్ లో డ్రగ్స్ డొంక బయటపడింది. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ దాడిలో పెద్దఎత్తున డ్రగ్స్‌ తయారుచేస్తున్నట్టు గుర్తించారు.

Hyderabad Drug Bust: హైదరాబాద్‌లో డ్రగ్స్ డెన్.. 12వేల కోట్ల మాదక ద్రవ్యాలు స్వాధీనం.. మహారాష్ట్రలో తీగ లాగితే..
Hyderabad Drug Bust

Updated on: Sep 06, 2025 | 5:53 PM

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టురట్టయ్యింది. మేడ్చల్ జిల్లాలో శనివారం మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. మహారాష్ట్రలో తీగ లాగితే.. హైదరాబాద్ లో డ్రగ్స్ డొంక బయటపడింది. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ దాడిలో పెద్దఎత్తున డ్రగ్స్‌ తయారుచేస్తున్నట్టు గుర్తించారు. మేడ్చల్ జిల్లా పరిధి చర్లపల్లిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ దాడుల్లో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ లభ్యమయ్యాయి. 32 వేల లీటర్ల రా మెటీరియల్‌ స్వాధీనం చేసుకున్నారు. 13 మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు..

కెమికల్ ఫ్యాక్టరీ మాటున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ తయారైన డ్రగ్స్ దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కి చెందిన మహిళ అరెస్ట్ తో ఈ డ్రగ్స్ గుట్టు బయటపడింది. మహారాష్ట్ర పోలీసుల దాడులతో.. తయారీదారులు, సరఫరాదారుల నెట్‌వర్క్‌ మొత్తం గుట్టురట్టయింది. ఫ్యాక్టరీలో పెద్దఎత్తున ఎండీ డ్రగ్స్‌ తయారీని గుర్తించారు.

కాగా.. హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున డ్రగ్స్ లభించడం తెలంగాణలో కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..