ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు అనేక కంపెనీల సంసిద్ధత : మంత్రి కేటీఆర్

|

Jun 30, 2021 | 10:12 PM

KTR Review : తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు..

ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా,  లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు అనేక కంపెనీల సంసిద్ధత : మంత్రి కేటీఆర్
Ktr Review
Follow us on

KTR Review : తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఆ మేరకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్ సూచించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదిత పెట్టుబడులను వివిధ జిల్లాలకు తరలించేలా ఆయా కంపెనీలను కోరాలని అధికార్లకు మంత్రి సూచించారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన  ప్రతిపాదనల మంత్రి కేటీఆర్ ఇవాళ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల వారీగా పరిశ్రమలు, ఐటీ శాఖ విభాగాధిపతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలువురు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వానికి అందజేశారని,  అటువంటి ప్రాంతాలకు ఈ పెట్టుబడులు తరలి వెళ్లేలా  ప్రయత్నించాలని వివిధ శాఖల డైరెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు.

Read also : తెలంగాణ పల్లెల్లో బీహారీ గ్యాంగ్ బీభత్సకాండ.. రాడ్లు, కర్రలతో రోడ్లపైకి వచ్చి బైక్ పై వెళ్తున్న వారిపై దాడులు.!