Hyderabad: హైడ్రా ఎంట్రీతో చిత్రపురి కాలనీలో విల్లాలకు నోటీసులు.. 15 రోజులు డెడ్‌లైన్

|

Aug 26, 2024 | 3:22 PM

హైడ్రా దూకుడు అందరిని హడలెత్తిస్తోంది. హైడ్రా ఎఫెక్ట్‌తో అధికారులు సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 225 విల్లాలకు మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసులివ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Hyderabad: హైడ్రా ఎంట్రీతో చిత్రపురి కాలనీలో విల్లాలకు నోటీసులు.. 15 రోజులు డెడ్‌లైన్
Chitrapuri Colony
Follow us on

అక్రమాల అంతు చూస్తోంది హైడ్రా. చిన్న సైజు గుడిసెల నుంచి, బడాసైజు బిల్డింగుల దాకా. పేదోళ్ల బస్తీలైనా.. పెద్దోళ్ల విల్లాలైనా.. దేన్నీ వదలే ప్రసక్తే లేదంటూ దూసుకుపోతోంది. పొలిటికల్‌ లీడర్ అని చూడట్లేదు.. సినీ హీరో అన్నది పట్టించుకోవట్లేదు. అక్రమ కట్టడం కనిపిస్తే… క్షణాల్లో కూల్చేస్తోంది. ఇక హైడ్రా దూకుడు చూసి అధికారులు సైతం అలర్ట్‌ అవుతవున్నారు. హైడ్రా పనితీరు చూసి… అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు నిర్మాణాలకు మున్సిపల్‌ కమిషనర్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పలు విల్లాలకు మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసులు పంపారు. జీవో 658కి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన 225 విల్లాలపై సీరియస్‌ అయ్యారు. జీ+1 నిర్మాణానికి అనుమతులు తీసుకుని… జీ+2 నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే… కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలంటూ చిత్రపురి సొసైటీ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో… మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో టెన్షన్‌ మొదలైంది.